AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్థరాత్రి దాకా మద్యం తాగి.. మత్తులో భర్తను చంపి.. ఆఖరుకు

చక్కగా సాగిపోతున్న వారి కాపురంలో మద్యం చిచ్చు రేపింది. భర్తకు వచ్చే ఆదాయం మద్యం తాగేందుకే సరిపోవడంతో కుటుంబ నిర్వహణ భారమైంది. దంపతులిద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉండటం..

అర్థరాత్రి దాకా మద్యం తాగి.. మత్తులో భర్తను చంపి.. ఆఖరుకు
Ganesh Mudavath
|

Updated on: Mar 02, 2022 | 7:53 PM

Share

చక్కగా సాగిపోతున్న వారి కాపురంలో మద్యం చిచ్చు రేపింది. భర్తకు వచ్చే ఆదాయం మద్యం తాగేందుకే సరిపోవడంతో కుటుంబ నిర్వహణ భారమైంది. దంపతులిద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉండటం, ముగ్గురు పిల్లలు సంతానం ఉండటం వంటి ఇబ్బందులతో వారి మధ్య గొడవలు(Conflicts) నిత్యకృత్యమయ్యాయి. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి భార్యాభర్తలిద్దరూ మద్యం(Wine) సేవించారు. మద్యం మత్తులో డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ ఏర్పడింది. భర్త నోటికొచ్చినట్లు తిట్టడాన్ని భార్య జీర్ణించుకోలేకపోయింది. కోపంతో బెల్టును భర్త మెడకు బిగించి హత్య చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి, నిందితురాలిని అరెస్టు చేశారు. రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలోని జాటియోలో అనిల్ కుమార్, మంజు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. దంపతులిద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉండటంతో అనిల్ కు వచ్చే జీతం కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదు. ఈ అంశంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దంపతులిద్దరూ మద్యం తాగారు. ఆ సమయంలో డబ్బుల విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. భార్య మాటలు భర్తకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. మత్తులో భార్యను దుర్భాషలాడటంతో ఆమె.. బెల్టును భర్త మెడకు చుట్టి, దారుణంగా హత్య చేసింది. వీరి అరుపులు, కేకలు విన్న మృతుడి తల్లి.. ఘటనాస్థలానికి చేరుకుంది. అప్పటికే అనిల్ మృతి చెంది ఉండటం చూసి హతాశురాలైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆమె నేరం అంగీకరించింది.

Also Read

ఇంటి బేస్‌మెంట్‌ కింద రహస్య అర.. అందులో ఏముందో చూసిన పోలీసులకు షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

UP Elections 2022: యూపీలో ఆరో విడత పోలింగ్‌‌కు సర్వం సిద్దం.. అందరి దృష్టి యోగి పోటీ చేస్తున్న గోరఖ్‌పుర్‌పైనే!