Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi New CM: కౌన్ బనేగా ఢిల్లీ సీఎం.. చైర్‌ రేసులో ఆరుగురి పేర్లు

కౌన్ బనేగా ఢిల్లీ సీఎం. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేల్లో ఇదే ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ సీఎం రేసులో పలువురు బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. దీంతో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిశీలిస్తోంది బీజేపీ హై కమాండ్‌. సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. CM మ్యూజికల్‌ చైర్‌ రేసులో ఆరుగురి పేర్లు వినిపిస్తున్నాయి.

Delhi New CM: కౌన్ బనేగా ఢిల్లీ సీఎం.. చైర్‌ రేసులో ఆరుగురి పేర్లు
Bharatiya Janata Party
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 09, 2025 | 6:14 PM

నెంబర్‌ వన్‌ పర్వేష్‌ సింగ్‌ వర్మ. ఢిల్లీ సీఎం రేసులో ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్‌ వర్మ. ఆయన వరుసగా రెండు సార్లు పశ్చిమ ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన 5.78 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇది ఢిల్లీ చరిత్రలో అతిపెద్ద విజయం. ఈసారి న్యూఢిల్లీ అసెంబ్లీ సీటులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను 4,099 ఓట్ల తేడాతో ఓడించి జెయింట్‌ కిల్లర్‌గా నిలిచారు పర్వేష్‌ వర్మ. ఇక పర్వేష్‌కు బాల్యం నుంచి RSSతో అనుబంధం ఉంది. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేష్‌ వర్మను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రైతు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రయత్నించవచ్చనే వాదన వినిపిస్తోంది. ఇక పశ్చిమ యూపీ, హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అత్యంత బలమైన జాట్‌ సామాజిక వర్గానికి చెందిన నేత పర్వేష్‌. ఈయనను సీఎం చేస్తే…ఆయా రాష్ట్రాల్లోని జాట్‌ సామాజిక వర్గాన్ని బీజేపీ తనవైపునకు తిప్పుకునే చాన్స్‌ ఉంటుంది. ఇక గెలిచిన వెంటనే అమిత్‌ షాను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు పర్వేష్‌. ఇది కూడా ఆయనకు కలిసివచ్చే అంశమే.

ఇక ఢిల్లీ సీఎం రేసులో వినిపిస్తున్న రెండో పేరు సతీష్‌ ఉపాధ్యాయ్‌. ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్‌గా చేసిన అనుభవం ఈయనకు ఉంది. ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత. ప్రస్తుతం NDMC వైస్ చైర్మన్‌గా ఉన్నారు. పరిపాలనా అనుభవం కూడా ఉంది. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో బలమైన అనుబంధం ఉంది. ఢిల్లీలో 12 నుంచి 14 శాతం బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి…ఈయన పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉంది.

ఇక ఈ రేసులో వినిపిస్తున్న మూడో పేరు ఆశీష్‌ సూద్‌. ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీకి పంజాబీ ఫేస్‌ ఈయన. పార్టీలో పంజాబీలకు ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం గోవా ఇన్‌చార్జ్, జమ్మూ కాశ్మీర్ సహ-ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. కేంద్ర నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు

రేసులో నెంబర్‌ 4…జితేంద్ర మహాజన్‌. వైశ్య సామాజికవర్గానికి చెందిన నేత. ఈయనకు RSSతో సత్సంబంధాలున్నాయి.

ఇక ఈ రేసులో వినిపిస్తున్న ఐదో పేరు విజేందర్‌ గుప్తాది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఈయన, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ హవా ఉన్నప్పటికీ, ఈయన గెలిచారు.

ఇక ఢిల్లీ సీఎం రేసులో మంజీందర్ సింగ్ సిర్సా పేరు కూడా వినిపిస్తోంది. 2013, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ టికెట్‌పై విజయం సాధించారు. తర్వాత రాజౌరి గార్డెన్ నుండి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2021లో శిరోమణి అకాలీదళ్‌ను వీడి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని సిక్కు సమాజానికి అండగా నిలిచారు. మంజీందర్ సింగ్ సిర్సాకు సీఎంగా అవకాశం ఇస్తే…పంజాబ్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీకి అవకాశం దక్కుతుంది. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే అరెస్ట్ పక్కా..!
బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే అరెస్ట్ పక్కా..!
దేవుళ్ళకు నైవేద్యంగా మద్యం మాంసం చేపలు సమర్పించే ఆలయాలు. ఎక్కడంటే
దేవుళ్ళకు నైవేద్యంగా మద్యం మాంసం చేపలు సమర్పించే ఆలయాలు. ఎక్కడంటే
నాని సినిమాలో విలన్‌గా ఒకప్పటి స్టార్ హీరో..
నాని సినిమాలో విలన్‌గా ఒకప్పటి స్టార్ హీరో..
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. ఎందుకో తెలుసా..?
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. ఎందుకో తెలుసా..?
PM ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ 2025 తుది గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే
PM ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ 2025 తుది గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళే జూన్ నెల కోటా విడుదల..
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళే జూన్ నెల కోటా విడుదల..
తెలంగాణ హాస్టల్‌ వెల్ఫేర్ ఆఫీసర్‌ తుది ఫలితాలు 2025 వచ్చేశాయ్‌..
తెలంగాణ హాస్టల్‌ వెల్ఫేర్ ఆఫీసర్‌ తుది ఫలితాలు 2025 వచ్చేశాయ్‌..
మంగళవారం ఈ వస్తువులు దానం చేస్తే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు..
మంగళవారం ఈ వస్తువులు దానం చేస్తే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు..
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..
APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఇవే
APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఇవే