Manipur: మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామా…
మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. జాతుల మధ్య వైరంతో కొంతకాలంగా మణిపుర్ అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీరెన్ సింగ్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఉదయం అమిత్ షాతో భేటీ అనంతరం.. తాజాగా సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు.

Biren Singh Resignation
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్.. సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ అజయ్ భల్లాకు రాజీనామా లేఖ అందజేశారు. కొంతకాలంలో మణిపూర్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీరెన్ సింగ్ పనితీరుపై విమర్శలు వచ్చాయి. ఈ ఉదయం కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు బీరెన్ సింగ్. ఈ సందర్భాలు పలు అంశాలపై సుధీర్ఘ చర్చ జరిగినట్లు తెలిసింది. సాయంత్రం సీఎం పోస్ట్‌కు రాజీనామా చేశారు బీరెన్ సింగ్.
#WATCH | Manipur CM N Biren Singh hands over the letter of resignation from the post of Chief Minister to Governor Ajay Kumar Bhalla at the Raj Bhavan in Imphal. pic.twitter.com/xCoiQUsmgQ
— ANI (@ANI) February 9, 2025