Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 31 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్ చరిత్రలోనే రెండో భారీ ఎన్‌కౌంటర్‌గా దీన్ని చెబుతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. మరికొంత మంది జవాన్లకు గాయాలవ్వడంతో, ఆస్పత్రికి తరలించారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో మావోయిస్టుల కోసం పోలీసుల బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి బలగాలు. ఈ ఏడాది బీజాపూర్‌లో ఇప్పటివరకు 56 మంది నక్సలైట్లు హతమయ్యారు. మొదటి ఎన్‌కౌంటర్‌లో 5 మంది .. రెండవ ఘటనలో 12 మంది.. మూడో ఎన్‌కౌంటర్లో మరో 8 మంది మృతి మావోయిస్టులు హతమయ్యారు. తాజా ఎన్‌కౌంటర్లో మరో 31 మంది మావోయిస్ట్‌లు మృతి చెందారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించిన విషయం తెలిసిందే.
కేంద్ర హోంశాఖ లెక్కలు ప్రకారం దేశంలో 2004-14తో పోలిస్తే 2014-23లో వామపక్ష తీవ్రవాద హింస 52 శాతం, మరణాల సంఖ్య 69శాతం తగ్గింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు ఆపరేషన్‌లు చేపట్టాలని గతేడాది కేంద్రమంత్రి అమిత్ షా భద్రతా బలగాలకు నిర్దేశించడంతో శక్తిమంతమైన మావోయిస్టు వ్యతిరేక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో డీజీపీలు, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌ల డైరెక్టర్ జనరల్‌లు, ఇండో-టిబెటియన్ బార్డర్ పోలీసులు, ఇంటెలిజన్స్ బ్యూరో అధికారులున్నారు. ముందస్తు ఆపరేషన్‌ల ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అమిత్‌షా తన లక్ష్యాన్ని నేరవేర్చుకుంటారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతెందుకు అబూజ్‌మడ్. మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డా. ఇప్పుడలాంటి కీలకమైన ప్రాంతం కూడా కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..