AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Majhi: బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం.. ఒడిశా ముఖ్యమంత్రిగా గిరిజన నేత.. ఎవరంటే..

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని మెజారిటీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలిసారిగా.. ఎలాంటి పొత్తు లేకుండా పూర్తిస్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది.. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ కు అవకాశం ఇచ్చింది.

Mohan Majhi: బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం.. ఒడిశా ముఖ్యమంత్రిగా గిరిజన నేత.. ఎవరంటే..
Mohan Majhi
Shaik Madar Saheb
|

Updated on: Jun 11, 2024 | 6:39 PM

Share

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని మెజారిటీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలిసారిగా.. ఎలాంటి పొత్తు లేకుండా పూర్తిస్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది.. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ కు అవకాశం ఇచ్చింది. 53ఏళ్ల మోహన్ మాఝీ ఒడిశా మొదటి బిజెపి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.. మంగళవారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో.. మోహన్ చరణ్ మాఝీ ఒడిశాలో BJP శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన మోహన్ చరణ్ మాఝీ బీజేపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. మాఝీ ఒడిషాలోని కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సమక్షంలో సీఎంను పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆదివాసీ నేతకు ఒడిశా సీఎం పగ్గాలు దక్కడం విశేషం. జూన్ 12న మాఝీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభాతి పరిదా, కేవీ సింగ్ డియో ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు హాజరవుతారు. భువనేశ్వర్‌ లోని జనతా మైదాన్‌లో కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం ఉంటుంది. సాయంత్రం 4.45 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది.

ధర్మేంద్ర ప్రదాన్‌ , జుయెల్ ఓరం లాంటి నేతలను పక్కనపెట్టి 52 ఏళ్ల మాఝీని హైకమాండ్‌ వ్యూహాత్మకంగా సీఎం పదవికి ఎంపిక చేసింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆదివాసీ ప్రాంతాల్లో మాఝీ గట్టి పట్టుంది. 2000, 2009, 209, 2024 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో నవీన్‌ పట్నాయక్‌ మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది.

ఓటమి ఎరగని నేతగా పేరున్న నవీన్‌ పట్నాయక్‌కు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. 25 ఏళ్ల ఐదు పర్యాయాలు అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ పార్టీ అనూహ్యంగా ఓటమి పాలయ్యింది. బీజేడీని ఓడించి ఒడిశాలో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది.

ఒడిశా అసెంబ్లీలో 147 స్థానాలు ఉండగా.. బీజేపీ 78, బీజేడీ 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..