AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై దాడుల సూత్రధారి తహవ్వూర్ రాణా తరపున వాదిస్తున్న న్యాయవాది ఎవరు?

ముంబై 26/11 దాడిలో ప్రధాన నిందితుడైన తహవ్వూర్ రాణా భారతదేశానికి తీసుకువచ్చారు ఎన్ఐఏ అధికారులు. దీని తర్వాత అతన్ని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అయితే న్యాయవాది పియూష్ సచ్‌దేవా కోర్టులో రాణా కేసును వాదిస్తున్నారు. సచ్‌దేవా ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీతో అనుబంధం ఉంది. రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ అతనికి ఇచ్చిన బాధ్యత కారణంగానే అతను ఈ కేసులో వాదనలు వినిపిస్తున్నారు.

ముంబై దాడుల సూత్రధారి తహవ్వూర్ రాణా తరపున వాదిస్తున్న న్యాయవాది ఎవరు?
Tahawwur Rana
Balaraju Goud
|

Updated on: Apr 11, 2025 | 10:45 AM

Share

తేదీ 26 నవంబర్ 2008, ముంబైలో ఉగ్రవాద దాడి జరిగిన రోజు ఇదే. ఈ దాడి జరిగి దాదాపు 17 సంవత్సరాలు అయ్యింది. కానీ ఈ కుట్రలో నిందితులైన చాలా మందికి ఇంకా శిక్ష పడలేదు. ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవ్వూర్ రాణాను ఎట్టకేలకు అమెరికా నుండి భారతదేశానికి తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ ఉగ్రవాద దాడిని ఎలా చేశారు..? ఏ కుట్ర పన్నారో త్వరలో బయటపడనుంది. కుట్ర వెనుక దాగి ఉన్న అన్ని రహస్యాలు బయటపడతాయి.

ముంబై దాడుల ప్రధాన నిందితుడు తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి NIA అతని 18 రోజుల కస్టడీకి తీసుకుంది. నిందితుడు తహవూర్ రాణా అమెరికాలో నివసిస్తున్న పాకిస్తానీ పౌరుడు. రాణాను ఉరితీయాలనే డిమాండ్ ఉంది. అయితే భారతదేశంలో రాణా తరుఫున కేసును వాదించడానికి, అతనిని ఉరి నుండి కాపాడటానికి, న్యాయవాది పియూష్ సచ్‌దేవా వకల్తా పుచ్చుకున్నాడు.

పియూష్ సచ్‌దేవా ఎవరు?

పియూష్ సచ్‌దేవా (37) ఢిల్లీకి చెందిన న్యాయవాది. అతను ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీతో అనుబంధం ఉంది. అయితే, రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ అతనికి ఇచ్చిన బాధ్యత కారణంగానే అతను ఈ కేసులో వాదిస్తున్నారు. రాణాను భారతదేశ శత్రువుగా పరిగణించే చోట అతని తరుఫున వాదనలు వినిపించనున్నారు. మరోవైపు, భారత న్యాయ వ్యవస్థ ప్రతి ఒక్కరికీ కోర్టులో పోరాడటానికి అవకాశం కల్పిస్తుంది. న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది. దీని కింద పియూష్ సచ్‌దేవా తన కేసును వాదిస్తారు.

న్యాయవాది సచ్‌దేవా 2011లో పూణేలోని ఐఎల్‌ఎస్ లా కాలేజీ నుండి లా డిగ్రీని అందుకున్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీ నుండి ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ కమర్షియల్ లాలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. అతని జీవితంలోని న్యాయ ప్రయాణం చాలా సుదీర్ఘమైంది. 2012 నుండి ప్రారంభమై దశాబ్దానికి పైగా కొనసాగింది. వృత్తిలో ప్రయాణం ఎంత ఎక్కువైతే, అతనికి అంత ఎక్కువ అనుభవం ఉంటుంది.

ఒక ఖైదీ కోర్టులో తన వాదన వినిపించుకోవడానికి న్యాయవాదిని నియమించుకోలేకపోతే, తన కేసును వాదించడానికి ఏ న్యాయవాది సిద్ధంగా లేకుంటే, అతను లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి న్యాయవాదిని అడగవచ్చు. దీని తరువాత, నిందితుడి అభ్యర్థన మేరకు, లీగల్ సర్వీసెస్ అథారిటీ అతని రక్షణ కోసం ఒక న్యాయవాదిని నియమిస్తుంది. దీని కింద, నిందితుడు తహవ్వూర్ రాణా న్యాయవాదిగా పియూష్ సచ్‌దేవా నియమితులయ్యారు. నిజానికి, న్యాయవాది సచ్‌దేవా నిందితుడు తహవ్వూర్ రాణా కేసును వాదించడం ద్వారా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..