ఎట్టకేలకు చిక్కిన సోషల్ మీడియా బ్యూటీ.. ఆమె చేసిన అరాచకాలు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
10 నెలలుగా పోలీసులను ముప్ప తిప్పలు పెడుతున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. హన్‌ట్రాప్, భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతున్న అమెను అహ్మదాబాద్‌లో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఐపీ అడ్రస్, ఫోన్ నంబర్లు, సిమ్ కార్డులు కూడా తరచూ మారుస్తుండడంతో క్రితిని పట్టుకోవ డం ఆలస్యమైందని పోలీసులు తెలిపారు.

ప్రముఖ బిల్డర్‌ను హనీట్రాప్ చేసి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు యత్నించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ క్రితి పటేల్‌ను అహ్మదాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గత 10 నెలలుగా సిమ్ కార్డులు మార్చుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న క్రితిని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఈమెపై గతేడాది జూన్ 2న సూరత్‌లో కేసు నమోదు కాగా.. కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సూరత్‌కు చెందిన ఒక బిల్డర్‌ను క్రితి పటేల్ హనీట్రాప్ చేసి, అతడిని బ్లాక్‌మెయిల్ చేస్తూ కోట్లాది రూపాయలు డిమాండ్ చేసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో క్రితితో పాటు మరో నలుగురి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. క్రితిపై ఇదే కేసు కాదు.. భూకబ్జాలు, బెదిరించి డబ్బు వసూలు చేయడం వంటి ఇతర కేసులు కూడా నమోదయ్యాయి.
అయితే, సూరత్ కోర్టు వారెంట్ జారీ చేసినప్పటి నుంచి ప్లేస్‌లు, సిమ్ కార్డులు మార్చుతూ పోలీసుల కళ్లకప్పి తిరుగుతోంది. టెక్నికల్ టీమ్, సైబర్ నిపుణుల సహాయంతో ఈనెల 18న ఎట్టకేలకు అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ ప్రాంతంలో క్రితి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీ అడ్రస్, ఫోన్ నంబర్లు, సిమ్ కార్డులు కూడా తరచూ మారుస్తుండడంతో క్రితిని పట్టుకోవడం ఆలస్యమైందన్నారు పోలీసులు..
ఆమె లొకేషన్ తెలుసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్ కొంత ఉపయోగపడిందని చెప్పారు. ఆమెపై నమోదైన కేసుల్లో విచారణ జరిపి వాంగ్మూలాన్ని నమోదు చేస్తామన్నారు. ఇక, ఎవరైనా ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొంటుంటే, నేరుగా పోలీస్ స్టేషన్లలో గానీ, ఏసీపీ లేదా డీసీపీ కార్యాలయాల్లో గానీ ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
