Alamgir Alam: పనివాడి ఇంట్లో అంత సొమ్మా..? అసలు ఎవరీ మంత్రి అలంగీర్‌ ఆలం.. ఏ పార్టీకి చెందినవాడు..

లోక్‌సభ ఎన్నికల వేళ రాంచీలో గుట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టల వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాంచిలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఈడీ నిర్వహించిన దాడుల్లో ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేసే వ్యక్తి ఇంట్లో ఏకంగా రూ.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తికి జార్ఖండ్‌ రాష్ట్ర మంత్రి అలంఘీర్‌ ఆలంతో సంబంధాలున్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఈ అలంఘీర్‌ ఎవరు అనే దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ..

Alamgir Alam: పనివాడి ఇంట్లో అంత సొమ్మా..? అసలు ఎవరీ మంత్రి అలంగీర్‌ ఆలం.. ఏ పార్టీకి చెందినవాడు..
Alamgir Alam

Updated on: May 06, 2024 | 5:08 PM

రాంచి, మే 6: లోక్‌సభ ఎన్నికల వేళ రాంచీలో గుట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టల వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాంచిలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఈడీ నిర్వహించిన దాడుల్లో ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేసే వ్యక్తి ఇంట్లో ఏకంగా రూ.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తికి జార్ఖండ్‌ రాష్ట్ర మంత్రి అలంఘీర్‌ ఆలంతో సంబంధాలున్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఈ అలంఘీర్‌ ఎవరు అనే దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

మంత్రి అలంగీర్‌ ఆలం రాజకీయ ప్రస్థానం ఇదీ..

1954లో పుట్టిన అలంఘీర్‌ 1974లో భాగల్పూర్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. రాష్ట్రంలో పకూర్‌ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సాహెబ్‌ గంజ్‌ జిల్లాలో నివాసం ఉండే అలంఘీర్‌ 2006లో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన అలంగీర్‌ ఆలం 2014, 2019లో వరుసగా విజయం సాధించారు. అలంఘీర్‌ ప్రస్తుత వయస్సు 70 ఏళ్లు. జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్‌ సోరెన్‌ మంత్రివర్గంలో గ్రామీణ మంత్రిత్వశాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. గతేడాది రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాచీ చీఫ్‌ ఇంజినీర్‌ వీరేంద్ర కుమార్‌ రామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడుల నేపథ్యంలో అలంఘీర్‌ పేరు తెరపైకి వచ్చింది. కాంట్రాక్టర్ల వద్ద కమిషన్‌ పేరిట భారీగా గడించినట్లు వీరేంద్ర కుమార్‌పై ఆరోపణలు వచ్చాయి. హేమంత్‌ సోరెన్‌ జైలుకు వెళ్లిన తర్వాత చంపాయ్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఆ టైంలో అలంఘీర్‌ను ఉపముఖ్యమంత్రిని చేయాలనే చర్చ బలంగా సాగింది. ఇంతటి పలుకుబడి ఉన్న అలంగీర్‌ తాజా ఈడీ దాడులతో వార్తల్లో నిలిచాడు.

ఈ రోజు జరిపిన ఈడీ దాడుల్లో రూ.25 కోట్లు బయటపడిన ఇల్లు జహంగీర్‌దిగా అధికారులు గుర్తించారు. ఈ వ్యక్తి మంత్రి అలంగీర్ సెక్రటరీ సంజీవ్‌లాల్‌ వద్ద పనిచేస్తున్నాడు. అతడి నెల జీతం రూ. 15 వేలు మాత్రమే. హౌస్‌ కీపర్‌గా పని చేసే ఇతగాడి ఇంట్లో కోట్లాది రూపాయల నోట్ల కట్టలు బయటపడటం ప్రతిఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ డబ్బును లెక్కించేందుకు బ్యాంకుల నుంచి యంత్రాలను తెప్పించారు. కాగా మంత్రి అలంగీర్‌కు సెక్రటరీ అయిన సంజీవ్‌కుమార్‌ గతంలో పది మంది మంత్రులకు పీఏగా పనిచేసినట్లు సమాచారం

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.