Operation Neer: చేసిన మేలు మరిచిపోవడాన్ని మాల్దీవులు అంటారు.. అండగా నిలిచిన భారత్‌కు నమ్మకద్రోహం..

|

Jan 08, 2024 | 3:59 PM

ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మొయిజు తీరుతో ఇరుదేశాల మధ్య సంబంధాలకు బీటలు పడడం మొదలైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో భారత్ ఔట్ అనే భారత వ్యతిరేక నినాదం ఇచ్చి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. చైనా వైపు మొగ్గు చూపిన మొయిజ్జు భారత వ్యతిరేకి కావచ్చు.. అయితే మాల్దీవులు కష్టాలు ఎదురైనప్పుడల్లా భారత్ అన్ని తానై నిలిచింది. తన స్నేహ హస్తం చాచి రెండు చేతులా సహాయం చేసింది. 2014లో చేపట్టిన 'ఆపరేషన్ నీర్' ఇందుకు ఉదాహరణ.

Operation Neer: చేసిన మేలు మరిచిపోవడాన్ని మాల్దీవులు అంటారు.. అండగా నిలిచిన భారత్‌కు నమ్మకద్రోహం..
India Maldives Relations
Follow us on

మాల్దీవులో కొత్త ప్రభుత్వం ఏర్పడి.. ఆ దేశ అధ్యక్షుడు భారత్ మీద ద్వేషంతో చేసిన మేలు మరచి ప్రవర్తించమే కాదు.. చైనా కు అతిదగ్గరగా చేరుతున్నారు. ప్రధాని మోడీ లక్షదీప్ పర్యటనతో ఆ దేశ మంత్రులు ఎంపిలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. దీంతో ఇరు దేశాల మధ్య ఇప్పుడు మైత్రి సంబంధాలు దెబ్బతిన్నాయి. వాస్తవంగా మొదట మాల్దీవుల నుండి భారత సైన్యాన్ని తొలగించే చర్చకు ఇప్పుడు ప్రధాని మోడీ గురించి అక్కడి మంత్రి వివాదాస్పద ప్రకటనతో అగ్గికి ఆజ్యం పోసినట్లు అయి భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మొయిజు తీరుతో ఇరుదేశాల మధ్య సంబంధాలకు బీటలు పడడం మొదలైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో భారత్ ఔట్ అనే భారత వ్యతిరేక నినాదం ఇచ్చి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. చైనా వైపు మొగ్గు చూపిన మొయిజ్జు భారత వ్యతిరేకి కావచ్చు.. అయితే మాల్దీవులు కష్టాలు ఎదురైనప్పుడల్లా భారత్ అన్ని తానై నిలిచింది. తన స్నేహ హస్తం చాచి రెండు చేతులా సహాయం చేసింది. 2014లో చేపట్టిన ‘ఆపరేషన్ నీర్’ ఇందుకు ఉదాహరణ.

2014లో మాల్దీవుల్లో నీటి సంక్షోభం తలెత్తింది. మాల్దీవులు భారతదేశం నుండి సహాయం కోరవలసినంత సంక్షోభం ఏర్పడింది. ఆ సంక్షోభం నుంచి భారత ప్రభుత్వం మాల్దీవులను బయటికి తీసుకొచ్చింది. ఆపరేషన్ నీర్ అంటే ఏమిటి? భారతదేశం మాల్దీవులకు ఎప్పుడు సహాయం చేసింది తెలుసుకుందాం..

ఆపరేషన్ నీర్ ఎలా మొదలైందంటే?

మాల్దీవుల రాజధాని మాలేలో ఆర్‌ఓ ప్లాంట్ ఫెయిలవ్వడంతో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఒక్క నీటి చుక్క దొరికితే చాలు అన్నంత దారుణంగా పరిస్థితి నెలకొంది. నగరం ప్రజల్లో భయాందోళనలతో నిండిపోయింది. అప్పుడు మాల్దీవులు భారత ప్రభుత్వాన్ని సహాయం కోరింది. ఆ సమయంలో విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్, విదేశాంగ కార్యదర్శి జైశంకర్. ఆపదలో ఉన్నవారికి తక్షణ సాయం అందించడంలో ముందుండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న సుష్మా స్వరాజ్ మాల్దీవుల విషయంలో కూడా తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే ప్రధాని మోడీతో మాట్లాడి మాల్దీవులకు సాయం అందేలా చూశారు.

ఇవి కూడా చదవండి

తక్షణ సాయం చేసిన వైమానిక దళం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం మాలే నగరానికి రోజూ 100 టన్నుల తాగునీరు అవసరమవుతుంది. అక్కడికి సహాయాన్ని పంపే బాధ్యతను భారత వైమానిక దళానికి అప్పగించారు. భారత వైమానిక దళం మూడు C-’17, మూడు IL-76 విమానాలను మోహరించింది. ప్యాక్ చేసిన నీటిని ఢిల్లీ నుంచి అరక్కోణం, అక్కడి నుంచి మాలేకు పంపించారు. సెప్టెంబరు 5వ తేదీ నుంచి 7 వ తేదీ మధ్య ఆర్మీ విమానం ద్వారా 374 టన్నుల తాగునీటిని మాలేకు౮ రవాణా చేసింది.

మాల్దీవులకు భారతదేశం ఎప్పుడెప్పుడు సహాయం అందించిందంటే

ఆపరేషన్ నీరు మాత్రమే కాదు.. భారతదేశం చాలా సందర్భాలలో మాల్దీవులకు సహాయం అందించింది., కోవిడ్ సమయంలో భారతదేశం ఆపరేషన్ సంజీవని నిర్వహించింది. మాల్దీవుల ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం ఔషధాలను, అవసరమైన వైద్య వస్తువులను రవాణా విమానం C-130J ద్వారా మాల్దీవులకు రవాణా చేసింది. ఇది మాత్రమే కాదు, ఇంతకుముందు భారతీయ సైన్యం వైరల్ టెస్ట్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి 14 మంది సభ్యుల వైద్య బృందాన్ని మాల్దీవులకు పంపింది. భారత ప్రభుత్వం మాల్దీవులకు 5.5 టన్నుల అవసరమైన మందులను బహుమతిగా ఇచ్చింది.

3 నవంబర్ 1988న ఆక్రమణదారులు మాల్దీవుల రాజధాని మాలే వీధుల్లోకి చేరుకున్నప్పుడు అక్కడి ప్రభుత్వం భారతదేశం నుండి సహాయం కోరింది. మాల్దీవులలో తిరుగుబాటు ప్రయత్నం ప్రారంభమైనప్పుడు ఆపరేషన్ కాక్టస్ అర్ధరాత్రి ప్రారంభమైంది. భారత ప్రభుత్వం భారత వైమానిక దళానికి చెందిన IL-76, An-2, An-32లను మాల్దీవులకు పంపింది. అదే సమయంలో, చుట్టుపక్కల ద్వీపాలు IAF మిరాజ్ 2000ల ద్వారా పర్యవేక్షిస్తునే ఉన్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఈ ఆపరేషన్ తో ప్రపంచానికి భారత వైమానిక దళంలోని ఎయిర్‌లిఫ్ట్ సామర్థ్యాన్ని సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఇవి మాత్రమే కాదు అనేక సందర్భాలలో భారత ప్రభుత్వం మాల్దీవులకు సహాయం పంపింది. కష్ట సమయాల్లో అండగా నిలిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..