West Bengal: ఆ స్థానం నుంచి పోటీ చేస్తారా?.. కేంద్ర మంత్రి అమిత్ షాకు మమతా బెనర్జీ సవాల్..
West Bengal: పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు..
West Bengal: పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీపై, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాకు నేరుగా సవాల్ విసిరారు. పశ్చిమబెంగాల్‌కు ఎవరైనా రావొచ్చన్న దీదీ.. నందిగ్రామ్‌లో అమిత్ షా పోటీ చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మమతా బెనర్జీ బెంగాల్‌లో అమిత్ షా పర్యటనపై తీవ్రంగా స్పందించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అమిత్ షా తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. బెదిరింపులకు భయపడే వ్యక్తిని తాను కాదని, తానేమీ బీజేపీకి బానిసను కాదని వ్యాఖ్యానించారు. అంతకుముందు.. బీజేపీని ఆమె వాషింగ్ మెషిన్‌గా అభివర్ణించారు. ఆ పార్టీలో చేరిన వారంతా నలుపు నుంచి తెలుపు రంగులోకి మారతారంటూ ఎద్దేవా చేశారు. తమ పార్టీ నుంచి ఎంతమంది వెళ్లినా వచ్చే నష్టమేమీ లేదన్నారు. రానున్న ఎన్నికల్లో టీఎంసీ 221 సీట్లు గెలుస్తుందని దీదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
Also read:
Thieves Hulchul: ఘరానా దొంగలు.. ఓటు కొనేందుకని వచ్చారు.. దాడిచేసి.. బంగారం దొచుకెళ్లిపోయారు..
Vizag Steel Plant: కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.. జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్..