Thieves Hulchul: ఘరానా దొంగలు.. ఓటు కొనేందుకని వచ్చారు.. దాడిచేసి.. బంగారం దొచుకెళ్లిపోయారు..
ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయంగా కాకపుట్టిస్తుంటే..మరోవైపు దొంగలు కూడా ఇదే అదునుగా తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..
ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయంగా కాకపుట్టిస్తుంటే..మరోవైపు దొంగలు కూడా ఇదే అదునుగా తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..ఓటుకు డబ్బులిస్తామని చెప్పి ఓ మహిళకు బురిడీ కొట్టించారు. ఓటుకు డబ్బులు ఇస్తామని నమ్మించి.. నేరుగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.. ఆ మహిళ అప్రమత్తంగా వ్యవహరించడంతో.. దాడి చేసి చోరీకి తెగబడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో చోటు చేసుకుంది.
గోకవరంలో నివసిస్తున్న వృద్ధ దంపతులు..సత్యనారాయణ, భూలక్ష్మి ఇంటి తలుపు తట్టిన దొంగలు..మీ ఓటుకు డబ్బులు ఇచ్చేందుకు వచ్చామని, ఆధార్ కార్డు త్వరగా తీసుకురావాలని చెప్పటంతో ఆ వృద్ధురాలికి అనుమానం వచ్చింది. అర్ధరాత్రి కావడంతో ఆమె మాటతీరును అనుమానించిన వృద్ధురాలు వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసే ప్రయత్నం చేసింది.
వృద్ధురాలు తేరుకునే లోపు అక్కడున్న మరో వ్యక్తి ఆమె తలపై కర్రతో బలంగా కొట్టి..మేడలో ఉన్న నాలుగు కాసుల బంగారం గొలుసుతో అక్కడి నుంచి పరారయ్యారు. అంతలో స్థానికులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
బోరబొండలో ఓ ఇళ్లు.. ఆ ఇంట్లో ఓ ట్రంకు పెట్టె.. అందులో అస్థిపంజరం.. అసలు మిస్టరీ విడిపోయింది..
డబ్బుల వర్షం కురుస్తుందని క్షుద్రపూజలు.. నమ్మారో అంతే సంగతులు.. భారీ మోసం వెలుగులోకి
ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు.. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయనానికి కమిటీ