Vizag Steel Plant: కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.. జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్..
Vizag Steel Plant: కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రముఖ సామాజికవేత్త, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Vizag Steel Plant: కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రముఖ సామాజికవేత్త, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవీకరించాలనే నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని, అలాంటి స్టీల్ ప్లాంట్‌ను ఇప్పుడు ప్రైవేట్‌పరం చేయడం సరికాదన్నారు. గురువారం నాడు విశాఖలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీనారాయణ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. ఇదే సమయంలో సీఎం జగన్ కూడా ఈ విషయంపై ఫోకస్ చేయాలన్నారు. కేంద్రం తన నిర్ణయం వెనక్కి తీసుకునేలా సీఎం జగన్ చొరవ చూపాలన్నారు. ఇందుకోసం ఎంపీలందరితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని లక్ష్మీనారాయణ కోరారు. అలాగే పార్టీలకతీతంగా పోరాడితే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని లక్ష్మీనారయణ విశ్వాసం వ్యక్తం చేశారు.
Also read: