పెద్దలు పెళ్ళికి నిరాకరించారని యువకుడి ఆత్మహత్య.. ప్రియుడిని కడసారి చూసేందుకు వచ్చిన ఆ యువతి..

పెద్దలు పెళ్ళికి నిరాకరించారని ఆవేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణవార్త తెలిసిన ఆ యువత కడసారి అతడిని చూసేందుకు వచ్చి ఆమె కూడా ప్రాణాలు విడిచింది..

  • Rajeev Rayala
  • Publish Date - 11:03 pm, Thu, 11 February 21
పెద్దలు పెళ్ళికి నిరాకరించారని యువకుడి ఆత్మహత్య.. ప్రియుడిని కడసారి చూసేందుకు వచ్చిన ఆ యువతి..
Women death

పెద్దలు పెళ్ళికి నిరాకరించారని ఆవేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణవార్త తెలిసిన ఆ యువత కడసారి అతడిని చూసేందుకు వచ్చి ఆమె కూడా ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన బెంగుళూరు లోని తుమకూరు జిల్లా చిక్కనాయకహళ్లిలో జరిగింది.  దీక్షిత్, పంచాక్షరి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీక్షిత్‌ స్వస్థలం చిక్కనాయకనహళ్లి కాగా, బెంగళూరులోని పి.దాసరహళ్లిలో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.  ]ఇక పంచాక్షరిది మండ్య జిల్లా మద్దూరు తాలూకా, కొప్ప గ్రామం. పెళ్లి చేసుకోవాలని అనుకోగా ఇద్దరివీ వేరువేరు కులాలు కావడంతో రెండు కుటుంబాలు నిరాకరించారు. దీంతో తమ ప్రేమ గెలవదని భావించిన దీక్షిత్ ఫిబ్రవరి 7న ఇంటికి వచ్చి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుని మరణ వార్త తెలుసుకున్న పంచాక్షరి అతని ఇంటిని వెతుక్కుంటూ చిక్కనాయకనహళ్లికి వచ్చింది. అయితే  ఏమైందోగానీ బుధవారం ఇంటి వద్ద ఓ షాప్ దగ్గర ఉరేసుకుని శవమై కనిపించింది. దాంతో విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రు బోరున విలపించారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని, హత్య చేసారని వారు ఆరోపించారు. దీక్షిత్ తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

చెన్నై మెరీనా బీచ్‌లో విషాదం.. విజయవాడకు చెందిన విద్యార్థులు గల్లంతు.. గాలిస్తున్న గజ ఈతగాళ్లు..