ట్రాలీ బ్యాగ్‌తో కారు ఎక్కిన యువకులు.. క్యాబ్ డ్రైవర్ అప్రమత్తతో షాకింగ్ సీన్..!
ట్రావెల్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసున్నారు ఇద్దరు యువకులు. ట్రాలీ బ్యాగ్ బరువుగా ఉండటం చూసి క్యాబ్ డ్రైవర్ కు అనుమానం వచ్చింది. ట్రాలీ బ్యాగులో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఖాళీ స్థలంలో కారును ఆపమని అడిగడటంతో అనుమానం మరింత బలపడింది. దీంతో క్యాబ్ డ్రైవర్ ఆ ఇద్దరు యువకులను ఆరా తీయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలోనే పోలీసులకు సమాచారం అందింది.

అసలే రాత్రి సమయం.. ఓ ఇద్దరు యువకులు యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కారు.. వారి బెదురు చూపులు.. ఏదో అనుమానాస్పదంగా తోస్తుండటంతో క్యాబ్ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. ఇంతలో వారి చేతిలోని సూట్‌కేసు బలవంతంగా ఓపెన్ చూసే సరికి ఓ మృతదేహం బయటపడటంతో షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు క్యాబ్ డ్రైవర్. నాటకీయ పరిణామాల నడుమ సాగిన ఈ ఉదంతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతా సమీపంలోని సోదేపూర్ ప్రాంతంలో మంగళవారం(మార్చి 11) రాత్రి చోటు చేసుకుంది. అసలేం జరిగింది..? ఏంటా కథ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..!
మంగళవారం రాత్రి 9.15 గంటల ప్రాంతంలో నాగర్‌బజార్ నుంచి సుమారు 18, 25 సంవత్సరాల వయసున్న ఇద్దరు యువకులు ఓ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నారు. క్యాబ్ డ్రైవర్‌ను విజ్ఞప్తి చేసి ఓ ట్రాలీ బ్యాగ్‌ను కళ్యాణి ఎక్స్‌ప్రెస్‌వేలోని నిర్జన ప్రాంతంలో దింపడానికి ఒప్పందం చేసుకున్నారు. అయితే.. ఆ యువకులు తీరు పట్ల క్యాబ్ డ్రైవర్‌కు అనుమానం వచ్చింది. దీంతో అసలు సంగతి ఏంటో తెలుసుకోవాలని క్యాబ్ డ్రైవర్ పూర్తి వివరాలపై వారి దగ్గర ఆరా తీశాడు. వారి నుంచి తికమక సమాధానాలు రావడంతో మరింత అనుమానించాడు క్యాబ్ డ్రైవర్. ఇదేదో సమస్యగా మారేలా ఉందని భావించిన ఆ యువకులు.. ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని పారిపోవడానికి ప్రయత్నించారు.
దీంతో క్యాబ్ డ్రైవర్ అప్రమత్తమై వెంటనే అందులో ఒక యువకుడిని పట్టుకోగా.. మరో యువకుడు తప్పించుకున్నాడు. వెంటనే పోలీసులకు క్యాబ్ డ్రైవర్ సమాచారం అందించగా.. రంగంలోకి దిగి పారిపోతున్న మరో యువకుడిని వెంబడించి పట్టుకున్నారు. నిందితులు కరణ్ సింగ్, కృష్ణ రామ్ సింగ్ అని, ఆ ఇద్దరూ రాజస్థాన్ వాసులుగా గుర్తించారు. ఆ ఇద్దరి తీరును పరిశీలించిన పోలీసులు.. వారి నుంచి అసలు విషయాన్ని బయటకు రాబట్టడానికి విచారణ చేపట్టారు. యువకులు చెప్పిన ప్రకారం వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని ట్రాలీని పరిశీలించగా.. అందులో ఓ యువకుడి మృతదేహాన్ని కనుగొన్నారు. యువకుల వద్ద బ్యాగ్‌లో రూ. 65 వేలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు బయటికొచ్చాయి. వ్యాపార ఒప్పందంలో ఆలస్యం కారణంగా వ్యాపారవేత్త భాగరామ్‌ను అతని వ్యాపార భాగస్వాములైన ఈ ఇద్దరు దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. భాగరామ్ తన వ్యాపార భాగస్వాములు కరణ్ సింగ్, కృష్ణ రామ్ సింగ్‌లకు రూ. 8 లక్షలు చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో ఆ ఇద్దరూ భాగరామ్ హత్యకు ప్లాన్ చేసి పక్కా ప్రణాళికలతో ఓ పథకం రచించారు. భాగరామ్‌ను వ్యాపార చర్చల్లో భాగంగా తమ ఇంటికి పిలిపించుకున్నారు. ఆపై ఇద్దరూ కలిసి భాగరామ్‌కు మత్తు మందు ఇచ్చి ఊపిరాడకుండా చేశారు.
చనిపోయాడని గ్రహించిన అనంతరం ఎలాగైనా మృతదేహాన్ని మాయం చేయాలని ప్రయత్నించారు. దీంతో మృతదేహాన్ని ఓ ట్రాలీలో కుక్కి అక్కడి నుంచి కళ్యాణి ఎక్స్‌ప్రెస్‌వేలోని నిర్జన ప్రాంతంలో పడవేయాలని భావించారు. ఈ క్రమంలోనే మృతదేహం రవాణా నిమిత్తం ఓ ట్రావెల్ యాప్‌ను సంప్రదించారు. కాగా, క్యాబ్ డ్రైవర్ అప్రమత్తతతో చివరికి ఇలా పోలీసులకు చిక్కుకోవడంతో వారి బండారం మొత్తం బయటపడింది. దీంతో పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నారు..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..