Student Death: తరగతి గదిలో 8వ తరగతి విద్యార్ధి అనుమానాస్పద మృతి..! హత్యా.. ఆత్మహత్యా?

|

Sep 18, 2023 | 8:24 AM

తరగతి గదిలో అనుమానాస్పదంగా ఉరివేసుకుని విద్యార్థి మృతి చెందాడు. శనివారం ఉదయం పొగాకు ఉత్పత్తులను రహస్యంగా వినియోగించేందుకు విద్యార్ధి బాత్‌రూమ్‌కు వెళ్లగా సెక్యూరిటీ గార్డు పట్టుకున్నాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు ఈ విషయాన్ని హాస్టల్‌ సూపర్‌వైజర్‌కు తెలిపాడు. ఇది జరిగిన మరుసటి రోజు అంటే ఆదివారం (సెప్టెంబర్‌ 17) సదరు విద్యార్ధి తరగతి గదిలో దిమ్మెలకు ఉరి వేసుకుని కనిపించాడు. ఈ షాకింగ్‌ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కక్‌ద్వీప్‌లో..

Student Death: తరగతి గదిలో 8వ తరగతి విద్యార్ధి అనుమానాస్పద మృతి..! హత్యా.. ఆత్మహత్యా?
Student Commit Suicide In Classroom
Follow us on

పశ్చిమ బెంగాల్, సెప్టెంబర్‌ 18: తరగతి గదిలో అనుమానాస్పదంగా ఉరివేసుకుని విద్యార్థి మృతి చెందాడు. శనివారం ఉదయం పొగాకు ఉత్పత్తులను రహస్యంగా వినియోగించేందుకు విద్యార్ధి బాత్‌రూమ్‌కు వెళ్లగా సెక్యూరిటీ గార్డు పట్టుకున్నాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు ఈ విషయాన్ని హాస్టల్‌ సూపర్‌వైజర్‌కు తెలిపాడు. ఇది జరిగిన మరుసటి రోజు అంటే ఆదివారం (సెప్టెంబర్‌ 17) సదరు విద్యార్ధి తరగతి గదిలో దిమ్మెలకు ఉరి వేసుకుని కనిపించాడు. ఈ షాకింగ్‌ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కక్‌ద్వీప్‌లో చోటు చేసుకుంది. మృతి చెందిన విద్యార్థి పేరు అనుశంకర్ మోండల్ (14). అనుశంకర్ బమంగర్ సబ్లా హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలోని హాస్టల్‌లో నివాసం ఉంటూ రహస్యంగా పొగాకు ఉత్పత్తులు వినియోగించేవాడు.

దీనిపై హాస్టల్‌ సూపర్‌వైజర్‌ తారాపద్‌ జానా మాట్లాడుతూ.. వంటగది సరిగ్గా ఉందో లేదో చూసేందుకు ఉదయం వంటగదికి వెళ్లాను. తర్వాత పాఠశాల తరగతి గదుల సందర్శనకు వెళ్లాను. ఆ సమయంలో ఒక సెక్యూరిటీ గార్డు తొమ్మిదో, పదో విద్యార్థుల హాస్టల్‌ను చూసుకునే ఇన్‌చార్జి గోవింద సర్దార్ అరుణ్‌బాబు ఫోన్ చేస్తున్నాడని చెప్పాడు. ఈ క్రమంలోనే విద్యార్ధి అనుశంకర్ మోండల్ బాత్‌రూమ్‌లో పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు తెలిపాడు. అనుశంకర్‌తోపాటు సుజిత్ మైతీ అనే మరో విద్యార్థి కూడా ఉన్నాడు. పొగాకు వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని, మళ్లీ ఇలా చేయవద్దని హెచ్చరించిన తర్వాత అందరూ భోజనానికి వెళ్లారు. ఆ తర్వాత నేను కూడా వెళ్లిపోయాను. ఆ తర్వాత అనుశంకర్‌ కనబడకుండా పోయాడు. కొందరు విద్యార్థులు స్నానానికి వెళ్లి ఉంటాడని చెప్పారు. ఆ తర్వాత కూడా హాస్టల్‌, తరగతి గదుల్లో వెతికారు. ఈ క్రమంలోనే అనుశంకర్‌ తరగతి గదిలో ఉరివేసుకున్నట్లు చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాం. పోలీసులతోపాటు గ్రామస్థులు కూడా వచ్చారు. వెంటనే బాలుడిని కిందికి దించి ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ మా ప్రయత్నాలేవీ ఫలించలేదని హాస్టల్‌ సూపర్‌వైజర్‌ తారాపద్‌ జానా తెలిపారు. దీంతో కాక్‌ద్వీప్ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం విద్యార్ధి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని, హాస్టల్‌లో 250 మందికి పైగా విద్యార్ధులు ఉంటున్నారని ప్రధానోపాధ్యాయుడు బల్దేవ్ బేరా తెలిపారు. 2010 నుంచి ఇదే స్కూల్‌లో పనిచేస్తున్నాను, ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదని పోలీసులకు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.