Adenovirus: అమ్మో అడినో వైరస్.. 17 మంది చిన్నారులు మృతి..

|

Mar 08, 2023 | 8:27 AM

పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపుతోందీ అడినో వైరస్. చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుంది. అనూహ్యంగా వ్యాప్తి చెందుతోంది. అడినో వైరస్ బారిన పడి ఇప్పటికే అక్కడ 17 మంది పిల్లలుమృత్యువాత పడ్డారు.

Adenovirus: అమ్మో అడినో వైరస్.. 17 మంది చిన్నారులు మృతి..
Adenovirus
Follow us on

పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపుతోందీ అడినో వైరస్. చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుంది. అనూహ్యంగా వ్యాప్తి చెందుతోంది. అడినో వైరస్ బారిన పడి ఇప్పటికే అక్కడ 17 మంది పిల్లలుమృత్యువాత పడ్డారు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారందరిలోనూ అడినో వైరస్ లక్షణాలు కనిపించినట్లు ప్రభుత్వం నిర్ధారించింది.

కరోనా వైరస్‌ను పోలివుండే లక్షణాలు దీనికి ఉన్నాయి.వైరస్ సోకిన వెంటనే శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి.చిన్నారులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది..న్యమోనియా సంబంధిత ఇబ్బందులకు ఈ వైరస్ కారణమౌతోంది.పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సర్కార్‌ ఆదేశించింది.

మూడేళ్లుగా ఏదో ఒక వైరస్‌ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది.ఇప్పుడు పశ్చిమబెంగాల్‌లో అడినో వైరస్‌ వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు..ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల సంఖ్య పెరుగుతుండడంతో వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..