Mamata Banerjee: రాష్ట్రానికి కొన్నేళ్లుగా ముఖ్యమంత్రి.. ఇప్పటి వరకూ సొంత ఇల్లు, కారు లేదు.. బ్యాంక్ అప్పులు లేవట..

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ లోని భవానీపూర్ నియోజకవర్గానికి సెప్టెంబర్ 30న ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ భవానీపూర్‌ నుంచి టీఎంసీ అధినేత్రి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో..

Mamata Banerjee: రాష్ట్రానికి కొన్నేళ్లుగా ముఖ్యమంత్రి.. ఇప్పటి వరకూ సొంత ఇల్లు, కారు లేదు.. బ్యాంక్ అప్పులు లేవట..
Mamata Banerjee
Follow us

|

Updated on: Sep 13, 2021 | 7:19 AM

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ లోని భవానీపూర్ నియోజకవర్గానికి సెప్టెంబర్ 30న ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ భవానీపూర్‌ నుంచి టీఎంసీ అధినేత్రి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో దీదీ గెలిస్తేనే సీఎంగా కొనసాగుతారు. ఈ నామినేషన్ పత్రాల్లో మమతా తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఇందులో తనకు సొంత ఇల్లు, వాహనం లేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు. 2అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం 2019-20లో ఉన్నదానికంటే పెరిగిందని దేదీ తెలిపారు. ఈ ఏడాది మేలో ముగిసిన 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసినప్పుడు మమతా బెనర్జీ ప్రకటించిన ఆదాయం.. తాజాగా మమతా దాఖలు చేసిన తాజా అఫిడవిట్ ప్రకారం దేదీ ఆదాయం రూ .5 లక్షలు పెరిగింది.

2019- 20 ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ ప్రకటించిన ఆదాయం రూ. 10,34,370. అయితే తాజాగా 2020-21లో ప్రకటించిన ఆదాయం రూ .16,47,845లు దీంతో ఈ ఐదు నెలల్లో దీదీ ఆదాయం ఐదులక్షల రూపాయల మేర పెరిగింది. ఇక 2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నామినేషన్‌తో దాఖలు చేసిన అఫిడవిట్‌లో.. మమతా బెనర్జీ ఆదాయం రూ .8,18,300.. అయితే 2019-20లో ఆదాయం గణనీయంగా రూ .20,71,010 కి పెరిగింది.

ఇక మమత బెనర్జీ బ్యాంక్​ బ్యాలెన్స్​ ప్రస్తుతం రూ.13,11,512గా ఉన్నదని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. నందిగ్రామ్ ఎన్నికల సమయంలో మమత బ్యాంక్ బ్యాలెన్స్ 13,53,000గా చూపించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బ్యాంక్ బ్యాలెన్స్ రూ.27,61,000గా ఉన్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం తన వద్ద రూ.69,255 నగదు ఉన్నట్లుగా మమత పేర్కొన్నారు. ఇక 9.7 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని, ఏ బ్యాంకులో అప్పు లేదని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా మమత భవానీపూర్‌ నుంచి 2011, 2016 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. బెంగాల్‌లోని పలు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ ఉపఎన్ని కలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా భవానీపూర్‌లో మమతకు పోటీగా బీజేపీ నేత ప్రియాంక తిబ్రేవాల్‌ పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ఆమె పేరును నామినేట్‌ చేసింది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తే ఈ ప్రియాంక తిబ్రేవాల్‌. దీంతో ప్రస్తుతం ఈ ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Vidura Niti: లోకంలో నిద్రపట్టనివారు ఎవరు?.. మనిషికి ఆరు సుఖాలు ఏమిటో చెప్పిన విదురుడు..