Monsoon: అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి రుతుపవనాలు.. మరో రెండు మూడు రోజుల్లో..

Mansoon: నైరుతి రుతుపవనాలు అండమాన్‌, నికోబార్‌ దీవుల వద్ద బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. రెండు మూడు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు,

Monsoon: అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి రుతుపవనాలు.. మరో రెండు మూడు రోజుల్లో..
Monsoon

Updated on: May 17, 2022 | 9:56 AM

Monsoon: నైరుతి రుతుపవనాలు అండమాన్‌, నికోబార్‌ దీవుల వద్ద బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. రెండు మూడు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్‌ సముద్రం ప్రాంతాల్లో మరింత ముందుకు సాగే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది వాతావరణశాఖ. ఈ నెలాఖరుకు కేరళ తీరానికి, వచ్చే నెల 8 నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది.

ఈ నెల 17 నుంచి మేఘాలయ రాష్ట్రంలో కూడా అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అనేక జిల్లాలతో పాటు అస్సాం, మేఘాలయ, కేరళలోని అన్ని జిల్లాల్లో శనివారం నుంచి విపరీతమైన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో వల్ల దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులను అనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాల విస్తరించనున్నాయి.

ఇవి కూడా చదవండి

రాబోయే ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలలో విస్తారంగా తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.