Stock market: లాభాల్లోనే ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. అందరి చూపు ఎల్ఐసీ లిస్టింగ్ వైపే..
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్లు పాజిటివ్ నోట్ లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటలకు బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 311 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ 104 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది.
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్లు పాజిటివ్ నోట్ లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటలకు బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 311 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ 104 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. వీటికి తోడు బ్యాంక్ నిఫ్టీ సూచీ 296 పాయింట్ల ఎగబాకగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 165 పాయింట్లు పెరిగింది. ఈ రోజు ఎల్ఐసీ షేర్ మార్కెట్లో లిస్టింగ్ అవుతున్నందున అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందువల్ల మార్కెట్లలో ట్రేడింగ్ మందంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో డాలర్ తో రూపాయి మారకపు విలువ 11 పైసలు పుంజుకుని 77.71 రూపాయల వద్ద ఉంది. ప్రదీప్ ఫాస్ఫేట్స్ ఐపీవో సబ్ స్క్రిప్షన్ నేడు ప్రారంభం కానుండగా.. ఇథాస్ కంపెనీ ఐపీవో రేపటి నుంచి ప్రారంభం కానుంది.
నిఫ్టీ సూచీలో వేదాంతా 5.10%, హిందాల్కొ 4.44%, ఓఎన్జీసీ 2.80%, టాటా స్టీల్ 2.45%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.79%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.41%, కోల్ ఇండియా 1.40%, అదానీ పోర్ట్స్ 1.38%, గెయిల్ 1.36%, మహీంద్రా అండ్ మహీంద్రా 1.32% మేర ఆరంభంలో లాభపడి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో సిప్లా 0.88%, సన్ ఫార్మా 0.44%, ఇన్ఫోసిస్ 0.34%, టెక్ మహీంద్రా 0.26%, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 0.24%, ఏషియన్ పెయింట్స్ 0.22%, లుపిన్ 0.21%, పవర్ గ్రిడ్ 0.09% మేర ఆరంభంలో నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.