Monsoon in Kerala: నైరుతి రుతుపవనాలు దక్షిణ శ్రీలంకను పూర్తిగా ఆవహించాయి. దీంతో రానున్న 48 గంటల్లో లక్షదీవులు, మాల్దీవులను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఆరు రోజుల అనంతరం నైరుతి రుతుపవనాలు వేగంగా కేరళ వైపు పయనిస్తున్నాయని తెలిపింది. మరో రెండు రోజుల పాటు కేరళలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
నైరుతి రుతుపవనాలు సర్వ సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. ఈ నేపథ్యంలో 27 నాటికి నైరుతి రుతుపవనాలు ప్రవేశ స్థాయి అన్నారు. అయితే ఈ ఏడాది ముందుగానే కేరళను తాకనున్నాయని.. ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో అసని తుపాను కారణంగా నైరుతి రుతుపవనాలు గత నెలలో వేగం పుంజుకున్నాయని వాతావరణ విశ్లేషకులు చెప్పారు.
నైరుతి రుతుపవనాలు బలపడి కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దేశమంతటా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖకు చెందిన నిపుణులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..