2022 లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లకూ తాము పోటీ చేస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో 182 సీట్లు ఉన్నాయి. ఒక మోజు పర్యటనకు గాను సోమవారం అహమ్మదాబాద్ కు వచ్చిన ఆయన..ఇక్కడ బీజేపీ-కాంగ్రెస్ రెండు పార్టీలూ చేతులు కలిపాయని, అందువల్లే ఈ రాష్ట్ర ప్రజలు మరో మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ఢిల్లీలో విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు ఇవ్వరని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. అలాగే 70 ఏళ్లయినా ఈ రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదన్నారు. ఈ స్టేట్ ఇక మారిపోతుందని, గుజరాతీ సోదరులు, సోదరీ మణులను కలుసుకునేందుకు తాను మళ్ళీ వస్తానని ఆయన చెప్పారు. 120 మంది సభ్యులున్న సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 27 సీట్లను గెలుచుకోవడం ద్వారా ఆప్ ఈ రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టింది. అహమ్మదాబాద్ లో తమ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్…గుజరాతీ న్యూస్ ఛానెల్ యాంకర్ ఇసుదాస్ గద్విని తమ పార్టీలో చేర్చుకున్నారు. అతడిని ‘కేజ్రీవాల్ ఆఫ్ గుజరాత్’ గా అభివర్ణించారు.
ఢిల్లీ మోడల్ ను మేము ఈ రాష్ట్రానికి తీసుకురాబోమని. మోడల్ అన్నది ఏ రాష్ట్రానికి అది వేరుగా ఉంటుందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ మోడల్ ని ఇక్కడి ప్రజలే నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. 2022 లో జరిగే గుజరాత్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక ఇక్కడ కూడా తమ పార్టీ కేడర్ ను బలోపేతం =చేయాల్సి ఉందన్నారు. అందుకు ఇప్పటి నుంచే కార్యాచరణకు ఉద్యుక్తులమవుతామని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పేదల కోసం ఇప్పటి వరుకు 14 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టా..సోహెల్ ఎమోషనల్ వర్డ్స్: Syed Sohel video.
Kaushal Manda funny dance video:బేటీతో కౌశల్ మంద ఫన్నీ డ్యాన్స్. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..