కీలక నిర్ణయం తీసుకున్న రైతు సంఘం నాయకులు… ఢిల్లీకి వచ్చే ఆ ఐదు మార్గాలను మూసేస్తాం..
భారతీయ కిసాన్ యూనియన్ క్రాంతికారి(పంజాబ్) అధ్యక్షుడు సుర్జిత్ ఎస్ పాల్ కీలక ప్రకటన చేశారు. ఓపెన్ జైలు లాంటి బురారికి వెళ్లబోమని..
భారతీయ కిసాన్ యూనియన్ క్రాంతికారి(పంజాబ్) అధ్యక్షుడు సుర్జిత్ ఎస్ పాల్ కీలక ప్రకటన చేశారు. ఓపెన్ జైలు లాంటి బురారికి వెళ్లబోమని, దానికి బదులుగా ఢిల్లీని ఘోరావ్ చేయాలని నిర్ణయించినట్లు సుర్జిత్ ప్రకటించారు. ఢిల్లీ ఘోరావ్‌కు పిలుపునిచ్చారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘మేము బురారీ పార్క్‌కు అస్సలు వెళ్లబోము. అది ఓపెన్ జైలు. మాకు అందిన సమాచారం ప్రకారం.. మమ్మల్ని జంతర్ మంతర్ వద్దకు తీసుకెళ్లినట్లే తీసుకెళ్లి.. బురారీ పార్క్ కు తరలించాలని పోలీసులు ప్లాన్ వేశారు. అందుకే అక్కడికి వెళ్లబోము. అది ఒక ఓపెన్ జైల్. మేము ఢిల్లీకి వెళ్లే బదులుగా ఢిల్లీలోకి ప్రవేశించే ఐదు ప్రధాన రహదారులను మూసివేయాలని నిర్ణయించాము. అలా ఢిల్లీని ఘోరావ్ చేయాలని తీర్మినించాము. నాలుగు నెలలకు సరిపడా సరుకులను మా వెంట తెచ్చుకున్నాం. మాకేం ఇబ్బంది లేదు. కేంద్రం వెనక్కి తగ్గే వరకు మా పోరాటాన్ని ఆపబోయేది లేదు.’ అని సుర్జీత్ ఎస్ పాల్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ‘ఛలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. అయితే ఢిల్లీ సరిహద్దుల్లోనే రైతులను పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. రైతులు ఢిల్లీ లోపలికి ఎంటర్ అవ్వకుండా ఎక్కడికక్కడ బారీకెడ్లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతులను చెదరగొట్టేందుకు వాటర్ కేనాన్లను ప్రయోగించారు. లాఠీచార్జి కూడా చేశారు. అయినప్పటికీ రైతులు ఏమాత్రం తగ్గకపోగా మరింత పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధమంటూ కేంద్ర మంత్రులు ప్రకటిస్తున్నా.. ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదు.
Instead of going to open jail in Burari, we’ve decided that we will gherao Delhi by blocking 5 main entry points to Delhi. We’ve got 4 months ration with us, so nothing to worry. Our Operations Committee will decide everything: Surjeet S Phul, President, BKU Krantikari (Punjab) https://t.co/aH5xm26WAi pic.twitter.com/2L0yL7vVmf
— ANI (@ANI) November 29, 2020