భారీ వర్షాలకు కూలిపోయిన వంతెన.. రాకపోకలకు అంతరాయం..

వెస్ట్ బెంగాల్‌లో భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలాం చేశాయి. ఇప్పటికే అనేక రోడ్లు, గ్రామాలు అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. బర్ధమాన్‌ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఓ వంతెన కూలిపోయింది.

భారీ వర్షాలకు కూలిపోయిన వంతెన.. రాకపోకలకు అంతరాయం..

Edited By:

Updated on: Jun 19, 2020 | 9:13 PM

వెస్ట్ బెంగాల్‌లో భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలాం చేశాయి. ఇప్పటికే అనేక రోడ్లు, గ్రామాలు అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. బర్ధమాన్‌ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఓ వంతెన కూలిపోయింది. దీంతో అక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఈ క్రమంలో తాత్కాలికంగా ఓ వంతెన నిర్మించారు. అది కూడా భారీ వర్షాలకు శుక్రవారం నాడు ఆ వంతెన కూడా కూలిపోయింది. దీంతో వంతెను ఇరువైపు వాహనాలు నాలుగు గంటల పాటు నిలిచిపోయాయి. ఆ తర్వాత వాహనాలు తిరిగి రిటర్న్ వెల్లాల్సి వచ్చింది. అయితే ఈ వంతెన వెస్ట్ బుర్దావన్, బీర్‌బూమ్ జిల్లాలకు మధ్యలో ఉంటుంది. దీంతో ఇరు జిల్లాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కాగా, గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అనేక చోట్ల రోడ్లన్నీ కొట్టుకుపోయాయి.