Farmers Protest: రైతు ఆందోళనపై మరోసారి పోలీసుల ప్రతాపం.. ర్యాలీని అడ్డుకునేందుకు వాటర్ కెనాన్ల ప్రయోగం

కొత్త చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులపై మరోసారి పోలీసుల లాఠీ విరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఏడాది కాలంగా నిరసన గళం వినిపిస్తున్నారు.

Farmers Protest: రైతు ఆందోళనపై మరోసారి పోలీసుల ప్రతాపం.. ర్యాలీని అడ్డుకునేందుకు వాటర్ కెనాన్ల ప్రయోగం
Haryana Farmers Protest

Updated on: Oct 02, 2021 | 5:44 PM

Haryana Farmers Protest: కొత్త చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులపై మరోసారి పోలీసు లాఠీ విరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఏడాది కాలంగా నిరసన గళం వినిపిస్తున్నారు. కేంద్రం మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహార్‌లాల్ ఖట్టర్ ఇంటి ముట్టడికి కిసాన్ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ఆందోళన నిర్వహిస్తున్న వేలాది మంది రైతులను అడ్దుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. రైతులపైకి వాటర్ కెనాన్లు ప్రయోగించి వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో పలువురు రైతులు గాయపడ్డారు.

రైతు ఆందోళన నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి ఇంటిముందు పోలీసులు ముందుగానే బారీకేడ్లు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయమే సీఎం ఇంటికి చేరుకున్న రైతులు బారీకేడ్లను దాటే ప్రయత్నం చేశారు. ఇంతలో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు వినియోగించారు. దీంతో అన్నదాతలు చెల్లాచెదురయ్యారు. ఇదిలావుంటే, శుక్రవారం భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. శనివారం భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. తికాయత్ పిలుపు మేరకు హర్యానాలోని బీజేపీ ఎమ్మెల్యేల ఇంటి ముందు రైతులు నిరసనకు దిగారు. రాష్ట్ర రాజధాని మనోహర్‌లాల్ ఖట్టర్ ఇంటి ముందు వేలాది మంది రైతులు ఆందోళన నిర్వహించారు.

రైతుల ఆందోళన విషయంలో హర్యానా పోలీసుల తీరుపై మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పంజాబ్ నుంచి వస్తున్న రైతులను హర్యానా సరిహద్దులో ఆపేసి వాటర్ కెనాన్లు ప్రయోగించడం, బాష్పవాయువు లాంటివి ప్రయోగించడం జనవరిలో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి రైతులపై పోలీసు దౌర్జన్యం పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.


Read Also….. Samantha- Naga Chaitanya Divorce: సమంత -నాగచైతన్య విడాకుల పై వర్మ రియాక్షన్.. అంతమాట అనేశాడేంటి..!!

Maruti: ఈ కారు ధర రాయల్‌ ఎన్‌ఫీల్డ్ కంటే తక్కువ.. జీరో డౌన్‌ పేమెంట్‌.. 6 నెలల వారంటీ