Viral Video: నడిరోడ్డుపై రెచ్చిపోయిన మందుబాబు.. కారు అద్దం పగలగొట్టి, దుర్భాషలాడుతూ హల్ చల్!

|

Aug 22, 2024 | 1:08 PM

మద్యం మత్తులో ఉన్న ఓ బందుబాబు నడిరోడ్డుపై రెచ్చిపోయాడు. కారులో కుటుంబంతోపాటు వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి నానాయాగి చేశాడు. కారు విండో అద్దాలు పగలగొట్టి, కారులోని వ్యక్తిని దుర్భాషలాడాడు. ఈ ఘటన మంగళవారం బెంగళూరులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో..

Viral Video: నడిరోడ్డుపై రెచ్చిపోయిన మందుబాబు.. కారు అద్దం పగలగొట్టి, దుర్భాషలాడుతూ హల్ చల్!
Biker Harassed Family In Bengaluru
Follow us on

బెంగళూరు, ఆగస్టు 22: మద్యం మత్తులో ఉన్న ఓ బందుబాబు నడిరోడ్డుపై రెచ్చిపోయాడు. కారులో కుటుంబంతోపాటు వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి నానాయాగి చేశాడు. కారు విండో అద్దాలు పగలగొట్టి, కారులోని వ్యక్తిని దుర్భాషలాడాడు. ఈ ఘటన మంగళవారం బెంగళూరులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో బెంగళూరు పోలీసులు అతగాడిని పట్టుకుని కటకటాల వెనుకవేశారు.

బెంగళూరులోని బాగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్జాపూర్ కార్మెలారం బ్రిడ్జిపై ఒక బైకర్ ఓ కారును అడ్డగించి, అందులోని వారిని అసభ్యంగా తిట్టాడు. కారులో ఓ జంటతోపాటు ఓ చిన్నారి కూడా ఉన్నాడు. పిల్లాడి గురించి చెప్పినా సదరు మందుబాబు పట్టించుకోకుండా మరింత రెచ్చిపోయాడు. విండ్‌షీల్డ్‌ను పగలగొట్టి, కారు అద్దాన్ని ధ్వంసం చేశాడు. పలువురు జోక్యం చేసుకుని అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో కారులోని చిన్నారి భయంతో గుక్కపట్టి ఏడ్వడం ప్రారంభించాడు. ఇక అందులోని మహిళ కాపాడండి అంటూ కేకలు వేయడం వీడియోలో చూడొచ్చు. ఈ మొత్తం ఘటనను కారులో నుంచి ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఇవి కూడా చదవండి

సర్జాపూర్ రోడ్డులో ఉన్న తమ కారుపై బైకర్‌ దాడి చేస్తున్నాడని, దయచేసి సహాయం చేయండని వీడియోలో పేర్కొంది. ఈ సంఘటన రాత్రి 10:30 గంటలకు వీధి 1522, దొడ్డకన్నెల్లి జంక్షన్ వద్ద జరిగిందని తెల్పింది. ఇక ఈ వీడియో పోలీసులకు చేరడంతో వెంటనే రంగంలోకి దిగారు. సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల సత్వర రియాక్షన్‌ను నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా గత కొంత కాలంగా బెంగళూరులోని పలు నగరాల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.