Watch Video: బొడ్లో ‘తుపాకీ’తో సీఎం మెడలో పూలమాల వేసేందుకు వచ్చిన అగంతకుడు.. వీడియో వైరల్

|

Apr 09, 2024 | 4:05 PM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు పార్టీలకు చెంచిన నేతలు ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ నేతలు ఓట్ల ప్రచారం మొదలుపెట్టారు. సోమవారం అక్కడ నిర్వహించిన భారీ ర్యాలీలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్నారు. రోడ్డుపై బహిరంగంగా ఏర్పాటు చేసిన వాహనంపై సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి తుపాకీని ఫ్యాంటు జేబులో కుక్కి..

Watch Video: బొడ్లో తుపాకీతో సీఎం మెడలో పూలమాల వేసేందుకు వచ్చిన అగంతకుడు.. వీడియో వైరల్
Man with gun gets close to CM
Follow us on

బెంగళూరు, ఏప్రిల్ 9: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు పార్టీలకు చెంచిన నేతలు ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ నేతలు ఓట్ల ప్రచారం మొదలుపెట్టారు. సోమవారం అక్కడ నిర్వహించిన భారీ ర్యాలీలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్నారు. రోడ్డుపై బహిరంగంగా ఏర్పాటు చేసిన వాహనంపై సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి తుపాకీని ఫ్యాంటు జేబులో కుక్కి ఆ వాహనం పైకి ఎక్కాడు. అంతేకాకుండా తనతోపాటు తెచ్చుకున్న పూల దండలను సీఎంతోపాటు అదే వాహనంలో ఆయన పక్కనే నిలబడి ఉన్న రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితోపాటు పలువురు నేతలకు పూలమాల వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సీఎం సిద్ధరామయ్య రక్షణపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని భైరసంద్రలో కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్యారెడ్డి తరపున సిద్ధరామయ్య ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

రియాజ్‌ అనే వ్యక్తి అకస్మాత్తుగా నడుముకు తుపాకీతో వాహనంపైకి ఎక్కాడు. అనంతరం కాంగ్రెస్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి తదితరులకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సదరు వ్యక్తి వాహనం దిగుతుండగా వాహనంపై ఉన్న సీఎం సిద్ధరామయ్యతో సహా పలువురు అతని ఫ్యాంటు బెల్టుకు ఉన్న తుపాకీని గమనించారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై రియాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆత్మరక్షణ కోసం తాను తుపాకీని తీసుకెళ్లానని, కొన్నేళ్ల క్రితం రియాజ్‌పై హత్యాయత్నానికి పాల్పడినప్పటి నుంచి తుపాకీ పట్టుకుని తిరుగుతున్నాడని పోలీసులకు తెలిపాడు. దీంతో అతడికి ఆయుధాలు కలిగి ఉండటంపై మినహాయింపు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

బర్త్‌డే పోస్టర్‌లలో కనిపించిన తుపాకీ పట్టుకున్న రౌడీలు ఇప్పుడు తుపాకీలతో ర్యాలీల్లో సీఎం, ఉప ముఖ్యమంత్రికి పూలదండలు వేస్తూ ప్రజల ముందుకు వచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ.. ఆ ప్రాంతంలోని ఓటర్లను భయపెట్టేందుకు తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారంటూ బీజేపీ విమర్శించింది. సీఎం సిద్ధరామయ్యకు దండలు వేసిన వారిని ‘గూండాలు, రౌడీలు, వీధి గూండాలుగా కమలం నేతలు ప్రచారం చేయసాగారు. తాజా ఘటన అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి బీజేపీకి అవకాశం ఇచ్చినట్లైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.