KTR: చెల్లి కోసం.. ఆటో ఎక్కిన అన్న కేటీఆర్.. వీడియో

|

Aug 27, 2024 | 3:45 PM

సుధీర్ఘ వాదనల అనంతరం సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. కవిత కేసులో ఈడీ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.

KTR: చెల్లి కోసం.. ఆటో ఎక్కిన అన్న కేటీఆర్.. వీడియో
KTR
Follow us on

సుధీర్ఘ వాదనల అనంతరం సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. కవిత కేసులో ఈడీ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. కాగా.. ఇవాళ రాత్రికి తీహార్ జైలు నుంచి కవిత విడుదల కానున్నారు.. అయితే.. బెయిల్ మంజూరు చేసిన వెంటనే.. తదుపరి పత్రాలు సమర్పించేందుకు కేటీఆర్ న్యాయవాదులతో కలిసి ఉరుకులు పరుగులు పెట్టారు. బెయిల్ ప్రక్రియను వీలైనంత పూర్తి చేసేందుకు కేటీఆర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో చెల్లికోసం కేటీఆర్‌ ఆటో ఎక్కారు..

కవితకు బెయిల్‌ రావడంతో సుప్రీం కోర్టు నుంచి తిహార్‌ జైలుకు బయల్దేరారు. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడటంతో కేటీఆర్ కారు వదిలి ఆటో ఎక్కారు. బెయిల్ ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయితే.. సాయంత్రం నాటికి కవిత విడుదల కానున్నారు.. కాగా.. ఇవాళ కేటీఆర్, కవిత, హరీష్ రావు ఢిల్లీలోనే ఉండి.. బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.. అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్ కు రానున్నారు.

వీడియో చూడండి..

అన్యాయంగా జైల్లో పెట్టారు..

ఎమ్మెల్సీ కవితను అన్యాయంగా జైల్లో పెట్టారని అన్నారు న్యాయవాది మోహిత్‌ రావు. తమ వాదనలో న్యాయం ఉంది కనుకే కవితకు బెయిల్‌ వచ్చిందన్నారు. కవిత బెయిల్‌ను అందరూ స్వాగతించాలన్నారు బీఆర్‌ఎస్ నేతలు. చార్జ్‌షీట్‌ వేశాక కవిత జైల్లో ఉండటం సరికాదని సుప్రీంకోర్ట్‌ ఆర్డర్‌లో స్పష్టంగా ఉందన్నారు.

బీఆర్ఎస్‌ శ్రేణుల సంబరాలు..

కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కవిత అంటే కేసీఆర్ బిడ్డ మాత్రమే కాదని.. ఆమె తెలంగాణ బిడ్డ అని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆమె మరింత బలంగా పార్టీలో పని చేస్తారని తెలిపారు. కేసీఆర్ చెప్పినట్టే కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. కవితను హింసించి కేంద్ర ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..