Viral Video: అయినా వీడని నిర్లక్ష్యం.. ఈసారి ఒకే ట్రాక్‌పైకి ఏకంగా నాలుగు రైళ్లు! వైరల్‌ వీడియో

|

Jul 27, 2024 | 6:58 PM

గతేడాది జూన్‌లో ఒడిశాలోని బాలేశ్వర్ (బాలాసోర్)లో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం ఇప్పటికీ కళ్లముందు మెదులుతూనే ఉంది. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆగివున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టి పట్టాలపై చల్లాచెదురుగా పడిపోయింది. అనంతరం అదే ట్రాక్‌పైకి వచ్చిన యశ్వంత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ రైలు బోగీలను ఢీకొట్టింది..

Viral Video: అయినా వీడని నిర్లక్ష్యం.. ఈసారి ఒకే ట్రాక్‌పైకి ఏకంగా నాలుగు రైళ్లు! వైరల్‌ వీడియో
Four Trains Came On The Same Track In Odisha
Follow us on

భువనేశ్వర్‌, జులై 27: గతేడాది జూన్‌లో ఒడిశాలోని బాలేశ్వర్ (బాలాసోర్)లో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం ఇప్పటికీ కళ్లముందు మెదులుతూనే ఉంది. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆగివున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టి పట్టాలపై చల్లాచెదురుగా పడిపోయింది. అనంతరం అదే ట్రాక్‌పైకి వచ్చిన యశ్వంత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ రైలు బోగీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 291 మంది మృతి చెందగా.. దాదాపు 1100 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాటి ఘోర ప్రమాదంలో మృత్యుఘోష ఇంకా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది. నాటి ప్రమాదం కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఒడిశా ప్రభుత్వం తేల్చి, ముగ్గురు అధికారులను అరెస్ట్‌ చేసింది. ఈ ఘటన తర్వాత ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో జరిగిన వరుస ప్రమాదాల్లో వేలాది మంది చనిపోయారు. అయినా అక్కడి ప్రభుత్వ ధోరణిలో పెద్దగా మార్పేమీ వచ్చినట్లు కనిపించడం లేదు.

తాగాజా ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో మరో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో లింగరాజ్‌ స్టేషన్‌ వద్ద నాలుగు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి ఏకంగా నాలుగు రైళ్లు ఒకదానివెంట మరొకటి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌ అవుతున్నారు. ఈ వీడియోలో రైల్వే ట్రాక్‌పై ఒక రైలు నిలబడి ఉండటం కనిపిస్తుంది. దానివెనకే వరుసగా కేవలం కొన్ని అడుగుల దూరంలో మూడు రైళ్లు ఒకదాని తర్వాత ఒకటి నిలబడి ఉండటం వీడియోలో కనిపిస్తుంది. అయితే ప్రమాదం ఏమీ జరగనప్పటికీ.. ఒకదాని వెనుక ఒకటి నెమ్మదిగా కదులుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో లింగరాజ్‌ స్టేషన్‌ వద్ద నాలుగు రైళ్లు ఒకే ట్రాక్‌పై ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ సర్క్యులేట్‌ అవుతోంది. వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడం తీవ్ర దుమారం లేపింది. దీంతో పలువురు రైల్వేలోని భద్రతా లోపాలను దుమ్మెత్తిపోస్తు్న్నారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో వీడియోపై ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే స్పష్టతనిచ్చింది.ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు దీనిపై మాట్లాడుతూ… ఇది భద్రతా లోపం కాదన్నారు. భువనేశ్వర్‌లోని లింగ్‌రాజ్‌ రోడ్డు పాసింజర్‌ హాల్ట్‌ వద్ద ఒకే లైన్‌లో నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఆటో సెక్షన్‌లోనిదని, ఆ సెక్షన్‌లో ఒకే ట్రాక్‌పై అనేక రైళ్లు నిలవొచ్చని క్లారిటీ ఇచ్చింది. సెక్షన్‌ కెపాసిటీ, భద్రతను పెంచడం ఈ సాంకేతికత ఉద్దేశమని వివరణ ఇచ్చింది. రోజూ వందలాది రైళ్లు ఈ ఆటో సిగ్నలింగ్‌ సెక్షన్‌లోనే రాకపోకలు సాగిస్తుంటాయని పేర్కొంది. వాస్తవం తెలుసుకోకుండా ఈ తరహా వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్‌ చేయడం రైల్వే ప్రతిష్ఠను దెబ్బతీయడమేనని, ఇలాంటి వాటిని ప్రచురించేముందు ధ్రువీకరించుకోవాలని సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.