Viral Video: ‘అయ్యో.. ఎంత నరకం అనుభవించాడో..’ రోడ్డుపై వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన ఆవు.. చివరికి

పట్టపగలు ఓ ఆవు భయంతో రోడ్లపై అడ్డదిడ్డంగా పరుగులు తీసింది. దానిని అదుపు చేసేందుకు ప్రయత్నించబోయిన ఓ వృద్ధుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఆవు మెడకున్న తాడు ఉచ్చులో అతని చెయ్యి చిక్కుకోవడంతో ఆవు రోడ్లపై అతన్ని ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో వృద్ధుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు..

Viral Video: ‘అయ్యో.. ఎంత నరకం అనుభవించాడో..’ రోడ్డుపై వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన ఆవు.. చివరికి
Cow Drags Elderly Man On Road

Updated on: Sep 03, 2023 | 4:17 PM

చండీగఢ్‌, సెప్టెంబర్ 3: పట్టపగలు ఓ ఆవు భయంతో రోడ్లపై అడ్డదిడ్డంగా పరుగులు తీసింది. దానిని అదుపు చేసేందుకు ప్రయత్నించబోయిన ఓ వృద్ధుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఆవు మెడకున్న తాడు ఉచ్చులో అతని చెయ్యి చిక్కుకోవడంతో ఆవు రోడ్లపై అతన్ని ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో వృద్ధుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే..

పంజాబ్‌లోని మొహాలీ జిల్లాకు చెందిన సరూప్ సింగ్ (83) భయంతో పరుగులు తీస్తోన్న అవును అదుపు చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆవు ఒక ఇంట్లోకి ప్రవేశించగా సరూప్ సింగ్ దాని వద్దకు వెళ్లాడు. అయితే ఆవు మెడకు ఉన్న తాడు ఉచ్చులో అతని చెయ్యి చిక్కుకు పోయింది. దీంతో ఆవు వృద్ధుడితో సహా ఇంట్లో నుంచి బయటికి పరుగులు తీసింది. సుమారు 100 మీటర్ల దూరం రోడ్డుపై సరూప్ సింగ్‌ను ఈడ్చుకెళ్లింది. రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దెబ్బలతోపాటు కొన్ని వాహనాలు అతన్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అతను మృతి చెందాడు.

ఇవి కూడా చదవండి

భయాందోళనకు గురైన ఆవు రోడ్లపై పరిగెత్తుతూ సింగ్‌ను ఈడ్చుకెళ్లిన విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఆ ఆవు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతటి విధ్వంసం సృష్టించడానికి కారణం ఏమై ఉంటుందనే విషయాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.