PM Modi: హర హర మహాదేవ్.. శ్రీ మహాకాల్ లోక్ కారిడార్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ..

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘శ్రీ మహాకల్ లోక్’ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోడీ మంగళవారం జాతికి అంకితం చేశారు.

PM Modi: హర హర మహాదేవ్.. శ్రీ మహాకాల్ లోక్ కారిడార్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ..
Pm Modi

Updated on: Oct 11, 2022 | 8:47 PM

ఉజ్జయిన్‌ మహాకాల్‌ కారిడార్‌ తొలిదశను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోకార్పణం చేశారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘శ్రీ మహాకల్ లోక్’ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోడీ మంగళవారం జాతికి అంకితం చేశారు. గుజరాత్ పర్యటన అనంతరం ప్రధాని మోడీ నేరుగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరానికి సాయంత్రం చేరుకున్నారు. అనంతరం మహాకాల్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రధాని మోడీకి వేదాశ్వీరచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మహా శివుడికి ప్రధాని మోడీ హారతి ఇచ్చారు. మహా శివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహాకాల్‌ ఒకటి. ఉజ్జయిని మహాకాల్‌ మందిరంలో పూజలు అనంతరం ‘శ్రీ మహాకల్ లోక్’ ప్రాజెక్టును ప్రధాని మోడీ ప్రారంభించారు.

ఉజ్జయినిలో రూ.856 కోట్ల వ్యయంతో మహా కాలేశ్వర్ ఆలయ కారిడార్ ప్రాజెక్టును చేపట్టింది. మహాకాల్ లోక్ మెగా కారిడార్ లో శివలింగం ఆవిష్కృతమయ్యింది. ఉజ్జయినిలో “శివలీల” 108 కుడ్యచిత్రాలు, పురాతణ కథలను వివరించే 93 విగ్రహాలు) ఆధారంగా దీనిని నిర్మించారు.

మహా కాళేశ్వర్ కార్యాలయంలో కారిడార్ ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తున్నారు. కారిడార్ మొదటి దశ నిర్మించడానికి రూ.350 కోట్ల ఖర్చు అయ్యింది. కారిడార్‌ను మహాకాల్ లోక్ అని పిలుస్తారు. ప్రాజెక్టు కింద ఆలయ ప్రాంగణాన్ని దాదాపు ఏడు రెట్లు విస్తరించనున్నారు.

 


ప్రాజెక్ట్ మొదటి దశలో మహాకాల్ దేవాలయం, రుద్రసాగర్ సరస్సు, వంతెన నిర్మాణం, సరస్సు ఒడ్డు, మహాకాళేశ్వర్ వాటిక, ధర్మశాల, అన్నక్షేత్రం (ఫుడ్ హాల్), ఒక బోధనా మందిరం వంటి వాటిని అందుబాటులోకి తెచ్చారు. అదేవిధంగా తామర చెరువు కూడా అందుబాటులోకి వస్తుంది. అయితే, పునరుద్ధరణ పూర్తయితే ఆలయ స్థలం దాదాపు ఎనిమిది రెట్లు పెరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..