Durga Puja Celebration: ‘టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ వచ్చేసింది.. ఈ ఏడాది స్పెషల్ ఏంటంటే?
Durga Puja Celebration: కౌంట్‌డౌన్ ముగిసింది..! 'టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' వచ్చేసింది. 'టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అక్టోబరు 9 నుంచి 13 వరకు ఐదు రోజుల పాటు రాజధాని నడిబొడ్డున ఉన్న మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో దుర్గామాత పూజలను 'టీవీ 9' నిర్వహిస్తోంది.
Durga Puja Celebration: కౌంట్‌డౌన్ ముగిసింది..! ‘టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ వచ్చేసింది. ‘టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అక్టోబరు 9 నుంచి 13 వరకు ఐదు రోజుల పాటు రాజధాని నడిబొడ్డున ఉన్న మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో దుర్గామాత పూజలను ‘టీవీ 9’ నిర్వహిస్తోంది.
2023 సంవత్సరంలో, TV 9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మొదటి సంవత్సరంలో నిర్వహించింది. ఈసారి టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా రెండో ఎడిషన్ పండుగ శోభను మరింత పెంచింది. ఢిల్లీలోని అత్యంత ఎత్తైన దుర్గాపూజ పండల్ వద్ద మాతృ ఆరాధన ఎంతో కీలకమైంది. మీరు నిజమైన పండుగ వాతావరణాన్ని ఆస్వాదించాలనుకుంటే ఈ పూజా పండల్‌కు తప్పక సందర్శించాల్సి ఉంటుంది.
సాంప్రదాయం, సంస్కృతితో కూడిన షాపింగ్ ఈ సంవత్సరం పూజలో అతిపెద్ద ఆకర్షణగా నిలవనుంది. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. ఇందుకోసం ఒక భారీ ప్రదర్శన ఉంది. 250కి పైగా స్టాళ్లు ఉన్నాయి. అత్యాధునిక ఫ్యాషన్, వినియోగ వస్తువులు, ఎలక్ట్రానిక్స్ దుకాణాలు, ఫర్నీచర్, వివిధ రకాల గృహాలంకరణ వస్తువులు ఇందులో కొలువుదీరనున్నాయి.
భోజన ప్రియులకు కూడా శుభవార్త ఉందండోయ్. ఢిల్లీ స్పైసీ ఫుడ్-దబార్, లక్నో కబాబ్ రుచి, బెంగాల్ తీపి రుచులు, హైదరాబాదీ బిర్యానీ మీరు కోరుకున్నది ఇక్కడ పొందవచ్చు.
సంగీత ప్రియులకు మస్త్ మజా కూడా ఉందండోయ్. లైవ్ షోస్, సూఫీ, బాలీవుడ్ హిట్ పాటలు ఇలా ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ప్రతిభావంతులైన కళాకారుల మధురమైన గాత్రం మీ మనసును ఆహ్లాదపరుస్తుంది. అయితే, ఈ ఐదు రోజుల పూజలతోపాటు పండగ రుచి చూడాలంటే టీవీ 9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి రావాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం బ్యాగ్‌లు సర్దేయండి.