AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..! ఇక తీర్పులు..

కరోనా ఎఫెక్ట్‌ సుప్రీంకోర్టుపై కూడా ప్రభావం చూపుతోంది. దేశంలో ఈ వైరస్ వ్యాప్తి ప్రబలుతుండటంతో.. సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను నివారించేందుకు గాను.. త్వ‌ర‌లోనే వ‌ర్చువ‌ల్ కోర్టులు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కేసుల విచారణ జరుగుతుందని సుప్రీం జ‌డ్జి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ సోమవారం నాడు పేర్కొన్నారు. కోర్టు పరిధిలో.. ఈ కరోనా మహమ్మారి వ్యాప్తికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. త్వ‌ర‌లో వ‌ర్చువ‌ల్ కోర్టుల‌ను ప్రారంభించనున్నట్లు […]

కరోనా ఎఫెక్ట్: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..! ఇక తీర్పులు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 16, 2020 | 6:30 PM

Share

కరోనా ఎఫెక్ట్‌ సుప్రీంకోర్టుపై కూడా ప్రభావం చూపుతోంది. దేశంలో ఈ వైరస్ వ్యాప్తి ప్రబలుతుండటంతో.. సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను నివారించేందుకు గాను.. త్వ‌ర‌లోనే వ‌ర్చువ‌ల్ కోర్టులు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కేసుల విచారణ జరుగుతుందని సుప్రీం జ‌డ్జి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ సోమవారం నాడు పేర్కొన్నారు.

కోర్టు పరిధిలో.. ఈ కరోనా మహమ్మారి వ్యాప్తికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. త్వ‌ర‌లో వ‌ర్చువ‌ల్ కోర్టుల‌ను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ట్ర‌య‌ల్ కోర్టుల్లో ప్రస్తుతం ప‌రిస్థితులు క్లిష్టంగా ఉన్నాయ‌ని, కేసుల విచారణ విషయమై అన్ని హైకోర్టుల‌తో చీఫ్ జ‌స్టిస్ ఎస్‌ఏ బాబ్డే సంప్రదిస్తున్నారన్నారు.

ఈ క్రమంలో వైర‌స్ వ్యాప్తికి అరికట్టేందుకు తొలి అడుగు వేశామ‌న్నారు. ఇక కేసుల‌న్నింటినీ డిజిట‌ల్ ఫైలింగ్ చేయ‌డం, వ‌ర్చువ‌ల్ కోర్టుల‌ను ప్రారంభించ‌డ‌మే తర్వాతి టార్గెట్ అని జస్టిస్ చంద్ర‌చూడ్ తెలిపారు. అంతేకాదు.. కోర్టుల్లో స్క్రీనింగ్ కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా..గత నెల ఫిబ్రవరి నుంచి మనదేశాన్ని కూడా వణికిస్తోంది. ఈ వైరస్‌బారిన పడి ఇప్పటికే ఇద్దరు మరణించగా.. మరో 108 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమర్జెన్సీ కేసులు మాత్రమే విచారిస్తామని శనివారమే సుప్రీం తెలిపింది. అంతేకాదు.. సోమవారం నుంచి 14 ధర్మాసనాల బదులుగా ఆరు ధర్మాసనాలు మాత్రమే పనిచేస్తున్నాయి. లాయర్లను కూడా పరిమితంగా అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. లిటిగెంట్లను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తుంది. ఈ మేరకు జిల్లా కోర్టులకు కూడా ఆదేశాలు జారీ చేసింది.

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..