AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇంకా ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్ షిప్’ పదాలెందుకు’ ? జస్టిస్ మురళీధర్

లాయర్లు తనను సంబోధిస్తున్నప్పుడు 'మై లార్డ్', 'యువర్ లార్డ్ షిప్' అనే పదాలను ఉపయోగించరాదని పంజాబ్-హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.మురళీధర్ కోరారు.

'ఇంకా 'మై లార్డ్', 'యువర్ లార్డ్ షిప్' పదాలెందుకు' ? జస్టిస్ మురళీధర్
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 16, 2020 | 6:42 PM

Share

లాయర్లు తనను సంబోధిస్తున్నప్పుడు ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్ షిప్’ అనే పదాలను ఉపయోగించరాదని పంజాబ్-హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.మురళీధర్ కోరారు. ఈ మేరకు ఆయన సూచించినట్టు చండీగఢ్ లోని బార్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఈయన ఇటీవలే ఇక్కడి కోర్టుకు బదిలీ అయ్యారు. న్యాయమూర్తులను ‘సర్’ అని గానీ, ‘యువర్ ఆనర్’ అని గానీ సంబోధించాలని చండీగఢ్ లోని హైకోర్టు బార్ అసోసియేషన్ గతంలో తమ లాయర్లకు సూచించింది. అయితే అనేకమంది న్యాయవాదులు తమ జడ్జీలను యువర్ లార్డ్ షిప్ అనో, మై లార్డ్ లేదా మిలార్డ్ అనో సంబోధిస్తూ వస్తున్నారు. తాజాగా జస్టిస్ మురళీధర్ ఈ సూచన చేయడం విశేషం.

ఢిల్లీ అల్లర్ల సందర్భంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతల ప్రసంగాల తాలూకు వీడియోలను తాము చూడలేదన్న నగర పోలీసు ఉన్నతాధికారులను అప్పటి ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న మురళీధర్ దాదాపు మందలించినత పని చేశారు. వారి తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో బహుశా తెరవెనుక బీజేపీ నేతల ప్రయత్నాల ఫలితమో, మరో కారణం వల్లో ఆ మరునాడే అయన పంజాబ్-హర్యానా హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. తన బదిలీని ఆయన హుందాగా స్వీకరించారు.

Follow Us
షాకింగ్.. గుడిలో పెళ్లి చేసుకున్న మహా కుంభమేళా బ్యూటీ.. వీడియో
షాకింగ్.. గుడిలో పెళ్లి చేసుకున్న మహా కుంభమేళా బ్యూటీ.. వీడియో
ఉదయం ‎బ్రేక్ ఫాస్ట్‎లో ఏది తినాలి.. చికెన్ లేక గుడ్లు?
ఉదయం ‎బ్రేక్ ఫాస్ట్‎లో ఏది తినాలి.. చికెన్ లేక గుడ్లు?
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్.. 10 జట్ల ఫుల్ స్క్వాడ్స్ ఇవే
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్.. 10 జట్ల ఫుల్ స్క్వాడ్స్ ఇవే
అద్దె ఇంట్లో ఉండేవారికి ఊరట.. కేంద్రం కొత్త రూల్స్
అద్దె ఇంట్లో ఉండేవారికి ఊరట.. కేంద్రం కొత్త రూల్స్
ఆ స్టార్ హీరోను నమ్మించి మోసం చేశా.. వెళ్లి క్షమాపణ చెప్పగా
ఆ స్టార్ హీరోను నమ్మించి మోసం చేశా.. వెళ్లి క్షమాపణ చెప్పగా
కర్పూరంతో ఇలా చేశారంటే దోమలు పరార్..రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు!
కర్పూరంతో ఇలా చేశారంటే దోమలు పరార్..రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు!
బూమ్రాకు పాఠాలు చెప్పింది నేనేనంటున్న యూఏఈ ఫాస్ట్ బౌలర్
బూమ్రాకు పాఠాలు చెప్పింది నేనేనంటున్న యూఏఈ ఫాస్ట్ బౌలర్
సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. వంటనూనెపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగన
సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. వంటనూనెపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగన
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోమన్నారు: టాలీవుడ్ హీరోయిన్
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోమన్నారు: టాలీవుడ్ హీరోయిన్
24 గంటలు ఏసీ వాడినా కరెంట్ బిల్ 100 దాటకూడదంటే..స్మార్ట్‌ టిప్స్‌
24 గంటలు ఏసీ వాడినా కరెంట్ బిల్ 100 దాటకూడదంటే..స్మార్ట్‌ టిప్స్‌