కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సీతారామన్ సాధారణ గృహిణి వలె కూరగాయల మార్కెట్ కు వెళ్లారు.. అక్కడ కూరగాయలను కొంటున్నారు. ఈ వీడియో నిర్మలా సీతారామన్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేయబడింది. శనివారం చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలోని కూరగాయల మార్కెట్‌కు నిర్మలా సీతారామన్ హఠాత్తుగా వెళ్లారు. కూరగాయల మార్కెట్‌లో హఠాత్తుగా కనిపించిన మంత్రిని చూసి జనం ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా మంత్రి నిర్మలా కూరగాయలు కొంటున్న వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వీడియోలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిలగడదుంపలను కొనుగోలు చేశారు. దీంతో పాటు కాకరకాయలను కూడా కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా నిర్మల మండిలోని కూరగాయల వ్యాపారులతో కూడా మాట్లాడారు. దేశంలో కూరగాయల ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. . దేశంలో ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతోంది. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.71 శాతం నుంచి ఆగస్టులో 7 శాతానికి పెరిగింది. ఆహార ధరల పెరుగుదల రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసింది.
కూరగాయల మార్కెట్ లో కేంద్ర మంత్రి
Some glimpses from Smt @nsitharaman‘s visit to Mylapore market in Chennai. https://t.co/GQiPiC5ui5 pic.twitter.com/fjuNVhfY8e
— NSitharamanOffice (@nsitharamanoffc) October 8, 2022
అంతర్జాతీయ మార్కెట్ లో హెచ్చుతగ్గులు, పండుగల డిమాండ్, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వంటి కారణాలతో శనివారం స్థానిక మార్కెట్‌లో ఆహార పదార్ధాల ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. డాలర్‌తో రూపాయి బలహీనపడటం వల్ల, దిగుమతిదారులు వంట నూనెల దిగుమతిపై కిలోకు రూ.10-15 నష్టాన్ని చవిచూస్తున్నారు. అంతే కాకుండా దిగుమతిదారులు భారీగా నష్టపోతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..