AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఇంటి ముందు ఆడుకుంటున్న కూతురిని కిడ్నాప్‌ చేసిన సొంత తండ్రి.. వీడియో వైరల్‌

ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయస్సున్న కుమార్తెను సొంత తండ్రి కిడ్నాప్‌ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య వద్ద ఉన్న ఆ చిన్నారిని అపహరించాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..

Watch Video: ఇంటి ముందు ఆడుకుంటున్న కూతురిని కిడ్నాప్‌ చేసిన సొంత తండ్రి.. వీడియో వైరల్‌
Father Kidnaped Daughter
Srilakshmi C
|

Updated on: Oct 12, 2025 | 10:32 AM

Share

జైపూర్‌, అక్టోబర్‌ 12: ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయస్సున్న కుమార్తెను సొంత తండ్రి కిడ్నాప్‌ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య వద్ద ఉన్న ఆ చిన్నారిని అపహరించాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే.. రాజస్థాన్‌లోని ఝుంఝును నగరంలోని గాంధీ చౌక్ ప్రాంతంకి చెందిన హేమంత్ సోని, ఆకాంక్ష దంపతులకు 2022 నవంబర్‌లో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయస్సున్న కుమార్తె వంశిక వారికి ఉంది. అయితే దంపతుల మధ్య గొడవలు తలెత్తడంతో ఆకాంక్ష కుమార్తెను తీసుకుని జుంజునులోని పుట్టింటికి వెళ్లిపోయింది. గత రెండేళ్లుగా ఆమె తండ్రి ఇంట్లోనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఈ క్రమంలో గురువారం (అక్టోబర్‌ 9) మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న వంశిక కనబడకుండా పోయింది. అప్పటి వరకు కూతురిని ఆడించి ఇంట్లోకి వెళ్లి వచ్చేటప్పటికి కూతురు అదృశ్యమైంది. దీంతో ఆందోళన చెందిన ఆకాంక్ష కుటుంబ సభ్యులు ఇంటి ముందు అమర్చిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆకాంక్ష భర్త హేమంత్ కుమార్తెను ఎత్తుకుని పరుగెత్తడం వీడియోలో కినిపించింది. దీంతో ఆకాంక్ష స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో భర్త హేమంత్ సోనీపై కిడ్నాప్‌ కేసు పెట్టింది. చేసింది. కుమార్తెను తీసుకెళ్తానంటూ హేమంత్‌ గత కొంత కాలంగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆకాంక్ష పోలీసులకు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో అతడు కన్న కూతురిని కిడ్నాప్‌ చేయడం స్థానికంగా కలకలం రేపింది. వీరి కేసు పెండింగ్‌లో ఉండటంతో కూతురి కష్టడీకి సంబంధించి ఇంకా తీర్పు వెలువడలేదు. అయినప్పటికీ, హేమంత్ సోని ఈ విధంగా బిడ్డను కిడ్నాప్ చేయడం తల్లి పట్ల అతడి కున్న ధ్వేషాన్ని ప్రతిబింబిస్తుంది. కాగా దీనిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసుకన్న పోలీసులు హేమంత్‌ కోసం వెతుకున్నారు. సొంత కుమార్తెను తండ్రి కిడ్నాప్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.