AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వైద్యుడి నిర్వాకం..12 ఏళ్లుగా మహిళ కడుపులో నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌.. బయల్పడిన 2 కత్తెర్లు.. ఎక్కడంటే

వైద్యో నారాయణి హరిః అన్నారు పెద్దలు..మన దేశంలో వైద్యుడు దేవునితో సమానం అని భావించి సమాజంలో ఉన్నత స్థానాన్ని ఇచ్చారు. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తమ వైద్య వృత్తిని నిర్వహించే డాక్టర్స్ ఉన్నారు. అదే సమయంలో వైద్యుడి నిర్వాకం వలన ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం.. లేదా అవయవాలను కోల్పోవడం వంటి కొన్ని కొన్ని సంఘటన గురించి తరచుగా వింటూనే ఉన్నాం.. తాజాగా ఓ మహిళ కడుపులో ఒకటి కాదు ఏకంగా రెండు కత్తెర్లలు కనిపించాయి. అవి ఆపరేషన్ సమయంలో వైద్యుడు నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచాయి. ఈ ఘటన మన ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు ఫోటోలు నేట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Viral News: వైద్యుడి నిర్వాకం..12 ఏళ్లుగా మహిళ కడుపులో నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌.. బయల్పడిన 2 కత్తెర్లు.. ఎక్కడంటే
Viral News
Surya Kala
|

Updated on: Oct 20, 2024 | 6:48 PM

Share

ఓ వైద్యుడి నిర్వాకం కారణంగా ఓ మహిళ కడుపునొప్పితో పదేళ్ల పాటు తీవ్ర ఇబ్బంది పడింది. సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ మహిళ 12 ఏళ్ల క్రితం గ్యాంగ్‌టక్‌లోని ఓ ఆసుపత్రిలో అపెండిక్స్ శస్త్ర చికిత్స చేయించుకుంది. అప్పటి నుండి ఆ మహిళ తరచుగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ వచ్చింది. చాలామంది వైద్యులను సంప్రదించినప్పటికీ నొప్పి తగ్గలేదు. నొప్పికి కారణం కూడా వారు గుర్తించలేకపోయారు. అయితే, ఈ నెల 8న ఆమె తనకు గతంలో శస్త్ర చికిత్స చేసిన ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించగా, వారు అనుమానంతో ఎక్స్‌రే తీయించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

ఆమె పొత్తికడుపులో రెండు సర్జికల్ కత్తెరలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆ మహిళకు శస్త్ర చికిత్స చేసి ఆ రెండు కత్తెరలను తొలగించారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆసుపత్రి వైద్యులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ పొత్తికడుపులో శస్త్ర చికిత్సకు ఉపయోగించే రెండు కత్తెరలు ఉంచి కుట్లు వేసిన విషయం 12 ఏళ్ల తర్వాత బయటపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం