Bank Working: బ్యాంకు ఉద్యోగులకు వారంలో 5 రోజులు మాత్రమే పని.. 2 రోజుల సెలవు నిబంధన ఎప్పటి నుంచి..?

బ్యాంకు ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పటివరకు వారికి ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారం మాత్రమే సెలవు ఉంటుంది. మిగిలిన శనివారాల్లో బ్యాంకులు సాధారణంగా తెరిచి ఉంటాయి. 2015 నుంచి ప్రతి శనివారం సెలవు ఇవ్వాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ డిమాండ్ ..

Bank Working: బ్యాంకు ఉద్యోగులకు వారంలో 5 రోజులు మాత్రమే పని.. 2 రోజుల సెలవు నిబంధన ఎప్పటి నుంచి..?
Follow us

|

Updated on: Oct 20, 2024 | 5:47 PM

వారంలో 5 రోజులు మాత్రమే పని చేసే అవకాశం కల్పించాలని, శని, ఆదివారాలు సెలవు ఉండాలని బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని అనేక ప్రైవేట్ కంపెనీలు వారానికి 2 రోజుల సెలవును అందిస్తాయి. అక్కడ వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాంకుల్లోనూ ఇదే కనిపిస్తోంది. ఈ మార్పు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఏకకాలంలో కనిపిస్తుంది. ఈ డిమాండ్‌కు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ కాన్ఫెడరేషన్ (IBA), బ్యాంక్ ఉద్యోగుల సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినందున ఇందులో పురోగతి కనిపిస్తోంది.

ఇప్పుడు ఈ నిర్ణయంపై ప్రభుత్వ తుది ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో బ్యాంకు ఉద్యోగులకు ప్రతి శనివారం, ఆదివారం సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ బ్యాంక్స్ కాన్ఫెడరేషన్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల మధ్య ఒప్పందం ప్రకారం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ నిబంధనలోకి వస్తాయి. అయితే, దీన్ని అమలు చేయడానికి ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి అనుమతి కూడా తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంకుల పనితీరుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఒక కన్ను వేసి ఉంచుతుంది.

ఇది కూడా చదవండి: Ratan Tata: దేశం టాటాకు సెల్యూట్ చేసిన వేళ.. ఈ డీల్‌కు మంచి గుర్తింపు!

ఇది బ్యాంకు ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పటివరకు వారికి ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారం మాత్రమే సెలవు ఉంటుంది. మిగిలిన శనివారాల్లో బ్యాంకులు సాధారణంగా తెరిచి ఉంటాయి. 2015 నుంచి ప్రతి శనివారం సెలవు ఇవ్వాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ డిమాండ్ దాదాపుగా నెరవేరే దశకు చేరుకుంది.

మార్పులు ఎలా ఉంటాయి?

ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించినట్లయితే, బ్యాంకుల పని వేళలు కూడా మారుతాయి. ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. అయితే కొత్త నిబంధన ప్రకారం.. బ్యాంకులు ఉదయం 9:45 గంటలకు తెరిచి సాయంత్రం 5:30 గంటలకు ఉంటాయి. దీని అర్థం బ్యాంకు ఉద్యోగులు రోజుకు 45 నిమిషాలు అదనంగా పని చేయాల్సి ఉంటుంది. ఈ మార్పు ఉద్యోగులకు ఉపశమనం కలిగించడమే కాకుండా, బ్యాంకింగ్ రంగంలో పని చేసే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఉద్యోగులు మరింత శక్తి, నైతికతతో పని చేయగలుగుతారు. ఇది వినియోగదారులకు మెరుగైన సేవలను అందించగలదు.

చాలా కాలంగా కొనసాగుతున్న డిమాండ్‌..

2015లో ప్రభుత్వం, ఆర్‌బీఐ, ఐబీఏల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. నెలలో రెండో, నాలుగో శనివారాల్లో సెలవు ఇవ్వాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి శని, ఆదివారాలు సెలవులు ప్రకటించాలని బ్యాంకు సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇప్పుడు దీనిపై దాదాపు ఏకాభిప్రాయం కుదిరిందని, ప్రభుత్వ తుది ఆమోదం తర్వాత ఈ విధానం అమలులోకి రానుంది. ఈ ఏడాది చివరిలోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ ప్రభుత్వం దీనిపై కచ్చితమైన నిర్ణయం తీసుకుంటుందని బ్యాంకు ఉద్యోగులు ఆశిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: జియో సినిమా త్వరలో మూతపడుతుందా? ముఖేష్ అంబానీ ఈ పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు:

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బ్యాంకు ఉద్యోగులకు వారంలో 5 రోజులు మాత్రమే పని..
బ్యాంకు ఉద్యోగులకు వారంలో 5 రోజులు మాత్రమే పని..
దేవరలో సైఫ్ భార్య.. బుల్లితెరపై అందాల రాక్షసి..
దేవరలో సైఫ్ భార్య.. బుల్లితెరపై అందాల రాక్షసి..
శభాష్ ఇండియా.. చిప్స్ తయారీ రంగంలో ఆ దేశాలకు గట్టిపోటీ..!
శభాష్ ఇండియా.. చిప్స్ తయారీ రంగంలో ఆ దేశాలకు గట్టిపోటీ..!
భారతీయ స్టార్టప్ కంపెనీలకు ఊరట.. ఏకంగా 300 శాతం వృద్ధి
భారతీయ స్టార్టప్ కంపెనీలకు ఊరట.. ఏకంగా 300 శాతం వృద్ధి
ఈ వ్యాధులున్న స్త్రీలు ప్రెగ్నెన్సీ ప్లాన్ వద్దంటున్న నిపుణులు..
ఈ వ్యాధులున్న స్త్రీలు ప్రెగ్నెన్సీ ప్లాన్ వద్దంటున్న నిపుణులు..
అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ.5 లక్షలు.. చివరికి..
అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ.5 లక్షలు.. చివరికి..
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
రాబోయే కాలంలో వ్యాపార వృద్ధికి భారత్‌ ఓ ఇంజిన్ లాంటిది: శామ్యూల్
రాబోయే కాలంలో వ్యాపార వృద్ధికి భారత్‌ ఓ ఇంజిన్ లాంటిది: శామ్యూల్
టీమిండియా కొంప ముంచిన ఆ ఒక్క నిర్ణయం.. లేకుంటే కథ వేరేలా ఉండేది
టీమిండియా కొంప ముంచిన ఆ ఒక్క నిర్ణయం.. లేకుంటే కథ వేరేలా ఉండేది
ప్రేమోన్మాది ఘాతుకం.. బాలికను ఒంటరిగా అడవిలోకి తీసుకెళ్లి..
ప్రేమోన్మాది ఘాతుకం.. బాలికను ఒంటరిగా అడవిలోకి తీసుకెళ్లి..
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..
గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..
చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా?
చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా?
బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!
బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!