‘టమాటాలకు కాపలాగా ఇద్దరు బౌన్సర్లు’.. ఈ వార్తాకథనం పూర్తిగా అవాస్తవమంటూ పీటీఐ క్షమాపణలు

|

Jul 10, 2023 | 9:29 AM

దేశ వ్యాప్తంగా టమాట రేట్లు భగ్గుమంటున్నాయి. పలుచోట్ల టమాట చోరీలకు కూడా పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారి తన దుకాణంలో కూరగాయలు కాపాడుకోవడానికి ఏకంగా ఇద్దరు బౌన్సర్లను నియమించుకున్నట్లు పీటీఐ ప్రసారం చేసిన న్యూస్..

టమాటాలకు కాపలాగా ఇద్దరు బౌన్సర్లు.. ఈ వార్తాకథనం పూర్తిగా అవాస్తవమంటూ పీటీఐ క్షమాపణలు
Vegetable Vendor Hires Bouncers
Follow us on

వారణాసి: దేశ వ్యాప్తంగా టమాట రేట్లు భగ్గుమంటున్నాయి. పలుచోట్ల టమాట చోరీలకు కూడా పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారి తన దుకాణంలో కూరగాయలు కాపాడుకోవడానికి ఏకంగా ఇద్దరు బౌన్సర్లను నియమించుకున్నట్లు పీటీఐ ఇచ్చిన న్యూస్ తప్పుడు కథనంగా తేలడంతో లెంపలు వేసుకుంది. ఇది పూర్తిగా అవాస్తవమైనదని తేలడంతో క్షమాపణలు తెల్పింది.

వారణాసిలోని లంక ప్రాంతంలో అజయ్ ఫౌజీ అనే వ్యాపారి సమాజ్ వాదీ పార్టీకి చెందిన కార్యకర్తగా పీటీఐ గుర్తించింది. దేశ వ్యాప్తంగా కూరగాయల ధరలు పెరిగిన నేపథ్యంలో  ప్రభుత్వాన్ని ప్రశ్నించే క్రమంలోనే  ఈ సమాచారం తమకు అందిందని, నిజనిర్ధారణ చేయడంతో విఫలం అయినందుకు క్షమాపణలు కోరింది.  ఇందుకు సంబంధించిన ట్వీట్ ను వెంటనే తొలగించింది.  ఉన్నత విలువలతో కూడిన నిష్పాక్షిమైన వార్తలను అందించడానికి తాము ఎప్పటికీ కట్టుబడి ఉంటామని హామీ ఇస్తూ ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

కాగా దేశంలో టమాట ధర కిలో రూ.140 నుంచి రూ.160 వరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో వారణాసిలోని ప్రతిపక్షానికి చెందిన సమాజ్ వాదీ పార్టీకి చెందిన  ఫౌజీ అనే వ్యాపారి టమాట వినియోగదారుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఇద్దరు బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నట్లు పీటీఐ వార్తను ప్రసారం చేసింది. గడచిన తొమ్మిదేళ్లలో ధరలు ఏ విధంగా పెరిగాయో తెలియజేస్తూ తన దుకాణంలో ఫ్లకార్డులు కూడా ఉంచినట్లు సదరు వార్తలో తెల్పింది.  ఐతే ఇది తప్పుడు కథనమని తెల్పుతూ పీటీఐ తాజాగా ట్వీట్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.