ఆ కారణంతో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణ.. వినియోగదారుల ఫోరమ్ కీలక తీర్పు

హెల్త్ ఇన్సూరెన్స్ పై వడోదర కన్యూమర్ ఫోరమ్ తీపి కుబురు చెప్పింది. ఎవరైన ఆస్పత్రిలో చేరి 24 గంటల్లోపే డిశ్చార్జి అయినప్పటికీ వారు కూడా ఇన్సురెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపింది.

ఆ కారణంతో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణ.. వినియోగదారుల ఫోరమ్ కీలక తీర్పు
Health Insurance

Updated on: Mar 15, 2023 | 6:02 PM

హెల్త్ ఇన్సూరెన్స్ పై వడోదర కన్యూమర్ ఫోరమ్ తీపి కుబురు చెప్పింది. ఎవరైన ఆస్పత్రిలో చేరి 24 గంటల్లోపే డిశ్చార్జి అయినప్పటికీ వారు కూడా ఇన్సురెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు ఆస్పత్రిపాలు కావడం తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. అయితే 2017లో వడోదరకు చెందిన రమేష్ చంద్ర జోషీ అనే వ్యక్తి ఓసారి జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ చేయగా వారు దాన్ని తిరస్కరించారు. దీనిపై రమేష్ కోర్టులో కేసు వేశాడు. ఇప్పుడు ఆ విషయంపై స్పందించిన కోర్టు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ రమేశ్ చంద్ర జోషీకి డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. అలాగే ప్రస్తుత కాలంలో కొత్త చికిత్సలు , మెడిసన్లు అభివృద్ధి అవుతున్నాయని, వీటివల్ల ప్రజలు తక్కువ సమయంలోనే లేదా హాస్పిటల్ కి వెళ్లకుండానే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని వడోదర ఇన్సురెన్స్ ఫోరమ్ వెల్లడించింది.

అనుకోకుండా ఎవరి కుటుంబలోనే అనారోగ్య సమస్యలు వచ్చి ఆస్పత్రిపాలైనప్పుడు హెల్త్ ఇన్సురెన్స్ అనేది రక్షణగా ఉంటుంది. కుటుంబ సభ్యలను కాపాడుకునేందుకు హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.ఈ ఇన్సురెన్స్ కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్యాష్ లెస్ రెండవది రీయింబర్స్ మెంట్. క్యాస్ లెస్ లో అయితే ఇన్సూరర్లే ఆస్పత్రికి అయిన ఖర్చులన్నీ ఆస్పత్రికే నేరుగా చెల్లిస్తారు. అయితే ఇన్సూరెన్స పొందిన వారు ఆ ఇన్సూరెన్స్ కంపెని ఒప్పందం చేసుకున్న నెట్ వర్క్ ఆస్పత్రిలోనే చేరాల్సి ఉంటుంది. ఇక రెండవది రీయింబర్స్ మెంట్ ఇందులో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నవారు ఆస్పత్రి నుంచి వెళ్లిపోయేటప్పుడు వైద్యానికి అయిన ఖర్చులన్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి మాకు ఇంత ఖర్చు అయ్యిందంటూ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. రీయింబర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లో నెట్ వర్క్ ఆస్పత్రికి, అలాగే నాన్ నెట్ వర్క్ ఆస్పత్రులకు కూడా వెళ్లినప్పటికీ క్లెయిమ్ చేసుకోవచ్చు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.