టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులు.. సమాంతరంగా గొయ్యి తవ్వుతున్న సిబ్బంది

ఉత్తరకాశీ టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉంది. టన్నెల్‌కు సమాంతరంగా గొయ్యిని తవ్వి కార్మికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్మీ సాయాన్ని కూడా సహాయక చర్యలు కోసం తీసుకుంటున్నారు.

టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులు.. సమాంతరంగా గొయ్యి తవ్వుతున్న సిబ్బంది
Uttarakhand Tunnel Crash (Shankar Prasad Nautiyal/Reuters)
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 18, 2023 | 9:28 PM

ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీలోని సిక్యారా టన్నెల్లో సహాయక చర్యలు నాలుగైదు రోజుల్లో మంచి ఫలితాలు ఇవ్వొచ్చని మాజీ PMO సలహాదారు ఖుల్బే చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం టన్నెల్లో కూలిన శబ్దం రావడంతో పనులు ఆపేశారు. ఈసారి టన్నెల్లో పైభాగం నుంచి తవ్వే ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపుఅటవీశాఖ నుంచి చెట్లు కత్తిరించే కట్టర్‌ తెప్పిచారు. టన్నెల్‌కు సమాంతరంగా గొయ్యిని తవ్వి , కార్మికులను రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆర్మీ సాయాన్ని కూడా సహాయక చర్యలు కోసం తీసుకుంటున్నారు.

ఉత్తరకాశీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి వరుసగా ఏడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాని కార్యాలయం అధికారులు కూడా సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 41 మంది కార్మికులు గత వారం రోజులుగా టన్నెల్‌ లోనే చిక్కుకున్నారు. అయితే టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులంతా క్షేమంగా ఉన్నారని ప్రాజెక్ట్‌ అధికారులు వెల్లించారు. డ్రిల్లింగ్‌ యంత్రంతో కూలిన శిథిలాల తొలచివేత ప్రక్రియ 24 మీటర్ల ముందుకు సాగింది. అమెరికా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఆగర్‌ యంత్రం కూడా బాగా పనిచేస్తోందన్నారు అధికారులు. సహాయక చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు మాజీ PMO సలహాదారు ఖుల్బే.

“మేమందరం కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాం.. దేశప్రజలు కోరుకున్నట్టే జరుగుతుంది. 41 మంది కార్మికులను రక్షించడమే మా కర్తవ్యం. ఎక్కడ పొరపాటు జరగకుండా చూస్తున్నాం.. నేను రావడంతో బాధితుల కుటుంబాల్లో విశ్వాసం పెరిగింది .. ఇంకా చాలా రోజులు ఇక్కడే ఉంటా..” అని ఖుల్బే పేర్కొన్నారు.

టన్నెల్‌ దగ్గర సహాయక చర్యలు మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఒక వేళ టన్నెల్‌ కూలితే కార్మికులు బయటకు రావడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ముందే ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023