AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Election: ఓటర్ల ఉత్సాహం గత ఎన్నికల రికార్డును బద్దలు కొట్టింది.. అన్ని పార్టీల్లో మొదలైన టెన్షన్

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లా అయిన సెహోర్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్‌లో ఓటర్లు విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఓటర్ల ఉత్సాహం గత 2018 ఎన్నికల రికార్డును బద్దలు కొట్టింది. సెహోర్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో 83.86 శాతం ఓటింగ్ జరగగా, అత్యధికంగా మాజీ రెవెన్యూ మంత్రి కరణ్ సింగ్ వర్మకు చెందిన ఇచావర్ అసెంబ్లీలో 85.73 శాతం ఓటింగ్ జరిగింది.

MP Election: ఓటర్ల ఉత్సాహం గత ఎన్నికల రికార్డును బద్దలు కొట్టింది.. అన్ని పార్టీల్లో మొదలైన టెన్షన్
Mp Cm Shivraj Singh Chouhan
Balaraju Goud
|

Updated on: Nov 18, 2023 | 6:04 PM

Share

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లా అయిన సెహోర్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్‌లో ఓటర్లు విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఓటర్ల ఉత్సాహం గత 2018 ఎన్నికల రికార్డును బద్దలు కొట్టింది. సెహోర్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో 83.86 శాతం ఓటింగ్ జరగగా, అత్యధికంగా మాజీ రెవెన్యూ మంత్రి కరణ్ సింగ్ వర్మకు చెందిన ఇచావర్ అసెంబ్లీలో 85.73 శాతం ఓటింగ్ జరిగింది.

మరోసారి మధ్యప్రదేశ్‌లో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో హోరెత్తించింది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఎలక్షణ్ క్యాంపెనింగ్ వరకు పక్కాగా ఫ్లాన్ చేసింది. బీజేపీ అగ్ర నాయకత్వం మొత్తం మధ్య ప్రదేశ్ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు. ఓటర్ల ఆకట్టుకోవడంలో పోటీ పడ్డారు. దీంతో గెలుపు ధీమాలో ఉన్నాయి బీజేపీ శ్రేణులు,. అటు ప్రత్యేకించి ఎన్నికల సంఘం ఓటింగ్ పర్సంటేజీ పెరిగేందుకు చర్యలు చేపట్టింది.

కాగా, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లాలో బుద్నీ, సెహోర్, అష్టా, ఇచావర్‌లతో సహా నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సెహోర్ జిల్లా కేశరియా కంచుకోటగా అవతరించింది. మొత్తం నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో, శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా బుద్నీ నుండి గెలుపొందగా, రఘునాథ్ సింగ్ మాల్వియా అష్టా నుండి, కరణ్ సింగ్ వర్మ ఇచ్చావర్ నుండి సుదేష్ రాయ్ సెహోర్ నుండి గెలిచారు.

ఈసారి కూడా ఒక్క సిట్టింగ్‌ ఎమ్మెల్యే మినహా ముగ్గురిని బీజేపీ మళ్లీ బరిలోకి దింపింది. రఘునాథ్ సింగ్ మాలవీయ స్థానంలో అష్టా నుంచి జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్ గోపాల్ సింగ్ ఇంజనీర్‌ను బీజేపీ అభ్యర్థిగా చేసింది. జిల్లాలోని బుద్నీ అసెంబ్లీ స్థానాన్ని పక్కన పెడితే.. మిగిలిన మూడు స్థానాలపై ఈసారి తీవ్ర పోటీ నెలకొంది. సెహోర్ జిల్లాలో అత్యధిక ఓటింగ్‌లో ఇచావర్ అసెంబ్లీ స్థానం మొదటి స్థానంలో ఉంది.

ఇచ్చవార్ అసెంబ్లీలో 85.73 శాతం ఓటింగ్ జరగగా, 2018 ఎన్నికల్లో ఇక్కడ ఓటింగ్ శాతం 83.04. అలాగే, సెహోర్‌లో 81.37 శాతం, గతసారి 80.72 శాతం, అష్టాలో 84.29 శాతం, చివరిసారి 82.57 శాతం, బుద్నీ అసెంబ్లీలో ఈసారి 84.07 శాతం, గతసారి ఇక్కడ 83.04 శాతం ఓటింగ్ నమోదైంది. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లా సెహోర్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో 0.77 శాతం ఎక్కువ ఓటింగ్ నమోదైంది. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లలో ఉత్కంఠ నెలకొంది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కాగా, ఈవీఎంలో నిర్లిప్తమైన అభ్యర్థుల భవితవ్యం డిసెంబర్ 3న వెలువడనున్న ఫలితాల్లో తేలనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…