Chardham Yatra 2021: ఉత్త‌రాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చార్‌ధామ్ యాత్ర‌ వాయిదా..

|

Jun 29, 2021 | 1:45 PM

Uttarakhand Government: చార్‌ధామ్ యాత్రను వాయిదా వేస్తున్న‌ట్లు ఉత్త‌రాఖండ్ ప్రభుత్వం ప్ర‌కటించింది. త‌దుప‌రి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ యాత్రపై

Chardham Yatra 2021: ఉత్త‌రాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చార్‌ధామ్ యాత్ర‌ వాయిదా..
Char Dham Yatra
Follow us on

Uttarakhand Government: చార్‌ధామ్ యాత్రను వాయిదా వేస్తున్న‌ట్లు ఉత్త‌రాఖండ్ ప్రభుత్వం ప్ర‌కటించింది. త‌దుప‌రి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ యాత్రపై వాయిదా కొన‌సాగుతుంద‌ని వెల్లడించింది. ఉత్త‌రాఖండ్ హైకోర్టు ఆదేశాల మేర‌కు తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. విచారణ అనంతరం మరలా నిర్ణయం తీసుకోనున్నట్లు ప్ర‌భుత్వం తెలిపింది. యాత్ర వాయిదా నేప‌థ్యంలో కొవిడ్ సంబంధ మార్గ‌ద‌ర్శ‌కాల్లో ప్ర‌భుత్వం మ‌రోసారి మార్పులు చేసింది. అంత‌కుముందు చార్‌ధామ్ యాత్ర దేవాలయాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి-యమునోత్రిలను దర్శించుకునేందుకు ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల ప్రజల కోసం యాత్రను పాక్షికంగా ప్రారంభించ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జూలై 1 నుంచి యాత్ర మొద‌టి ద‌శ‌ను, జూలై 11 నుంచి యాత్ర రెండో ద‌శ‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉత్త‌రాఖండ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖ‌లైంది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వ‌ం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. కోవిడ్ సూపర్ స్పైడర్‌గా మారకుండా యాత్రను నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. మనోభావాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్ స‌ర్కారు యాత్ర‌ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించింది.

Also Read:

ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి మరో షాక్..ఇండియా మ్యాప్ ను తప్పుగా చూపిన ఫలితం…

Hero Arjun: గుడి క‌ట్టించి భ‌క్తి చాటుకున్న హీరో అర్జున్‌.. క‌రోనా కార‌ణంగా వ‌ర్చువ‌ల్‌గా కుంభాభిషేకాన్ని చూడండంటూ