Yogi Adityanath: రెండో సారి రాష్ట్ర పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌ తొలి కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే..!

|

Mar 26, 2022 | 3:54 PM

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ వరుసగా రెండో సారి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గత సంవత్సరం పేదలకు సంక్షేమ..

Yogi Adityanath: రెండో సారి రాష్ట్ర పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌ తొలి కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే..!
Follow us on

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ వరుసగా రెండో సారి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గత సంవత్సరం పేదలకు సంక్షేమ పథకాలు, నేరగాళ్లపై కఠిన చర్యలు, ఇతర నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజలు మరోసారి యోగి ఆదిత్యనాథ్‌కు బ్రహ్మరథం పట్టారు. ఇక శనివారం యోగి అధ్యక్షతన కేబినెట్‌ (Cabinet) సమావేశం జరిగింది. మరోమూడు నెలల పాటు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా రేషన్‌ (Ration‌) సరుకులను అందించాలని నిర్ణయించారు. ఇలాగే ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనను మార్చి 31 నుంచి జూన్‌ 30 వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 15 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. కొత్త కేబినెట్‌ తీసుకున్న మొదటి నిర్ణయం. దీనిని మేం పారదర్శకంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే 2020లో కరోనా మహమ్మారి కారణంగా దేశ ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత రేషన్‌ను ప్రారంభించింది.

అలాగే నేరాలకు పాల్పడేవారిపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలో మహిళలు, అమ్మాయిలపై నేరాలకు పాల్పడినట్లయితే స్వయంగా వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని, లేకపోతే వారి ఇళ్లను సైతం బుల్డోజర్లతో కూల్చివేస్తామని ఇటీవలే ప్రకటించారు. తాజాగా ఓ వ్యక్తి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడటంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకి దొరక్కపోవడంతో సీఎం ప్రకటించినట్లుగానే అతని ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేశారు. దీంతో సదరు నిందితుడు వెంటనే పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇలాంటి విషయాలలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కఠినంగా వ్యవహరిస్తున్నారు. రెండో సారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా కఠినంగా వ్యవహరించాలని పోలీసులను అదేశించారు.

ఇవి కూడా చదవండి:

PK Meet Rahul Gandhi: గుజరాత్‌‌పై గురి పెట్టిన కాంగ్రెస్.. రంగంలోకి పీకే.. రాహుల్‌తో కీలక భేటీ!

Uma Bharati: అందుకే యోగి ప్రమాణ స్వీకారానికి రాలేదు.. కేంద్ర మాజీ మంత్రి ట్వీట్