ఉత్తరప్రదేశ్ లోని సంభల్‌లో తవ్వకాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పురాతన మెట్లబావిలో రెండో అంతస్తు దగ్గర తవ్వకాలను ఆపేశారు మున్సిపల్ అధికారులు విషవాయువులు బయటపడే ప్రమాదం ఉండడంతో తాత్కాలికంగా తవ్వకాలను నిలిపివేశారు. కొన్ని నిర్మాణాలు కూలే ప్రమాదం ఉండడంతో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మెట్లబావిలో మూడో అంతస్తు కూడా ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.. స్థానికులు కూడా ఇదే విషయం చెప్పారని అంటున్నారు.. అయితే ఇప్పటికే గ్యాస్ వాసన వస్తోందని , ఏమాత్రం పొరపాటు చేసినా ఈ నిర్మాణం కూలిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు . అందుకే పురావస్తు శాఖ అధికారుల సూచనల మేరకే తవ్వకాల విషయంలో ముందకెళ్తామని చెబుతున్నారు.
మనం రెండో అంతస్తులో ఉన్నాం.. ఇక్కడ మూడో అంతస్తు కూడా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. రెండో అంతస్తు వరకే తవ్వకాలు పూర్తయ్యాయి… అయితే ఇక్కడ చాలా బురద ఉంది.. బురదను యంత్రాలతో మాత్రమే తొలగించాలి.. ఏమాత్రం పొరపాటు చేసినా ఇది కూలే అవకాశం ఉంది.. చాలా జాగ్రత్తగా కలెక్టర్ ఆదేశాలతో తవ్వకాలు చేస్తున్నాం.. ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. గ్యాస్ కూడా వెలువడుతోంది. ఏఎస్‌ఐ పర్యవేక్షణలో మాత్రమే తవ్వకాలు జరగాలి.. ఇక్కడ తవ్వేవాళ్లు నిపుణులు
పురాతన బావిలో బురద విషయంలో అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.. అందుకే తాత్కాలికంగా తవ్వకాలను నిలిపివేశారు.. నిపుణుల బృందం , ప్రత్యేక యంత్రాలు వచ్చిన తరువాతే తవ్వకాలపై ముందుకెళ్లాలని నిర్ణయించారు.
మరోవైపు సంభల్‌లో షాహీ జామా మసీదు ముందు పోలీసు చౌక్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. స్థానికుల భద్రత కోసమే పోలీసు చౌక్ నిర్మాణాన్ని చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అయితే పోలీసు చౌక్ నిర్మాణాన్ని మజ్లిస్ ఎంపీ ఒవైసీ తప్పుపట్టారు. భారత్‌లో పర్యటిస్తున్న కువైట్ ప్రతినిధి బృందానికి ఈ పోలీసు చౌక్ నిర్మాణాన్ని చూపించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా ? అని ప్రశ్నించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..