Lord Shiva: వధువు కోసం శివయ్యకు పూజలు చేసిన యువకుడు.. శ్రావణ మాసం పూర్తి అయినా పెళ్లి కుదరలేదని ఏమి చేశాడంటే..

|

Sep 06, 2023 | 1:06 PM

పెళ్లి ఈ శ్రావణ మాసం అయ్యేలోగా జరగాలని కోరుకుంటూ.. శివ భక్తుడైన ఓ యువకుడు శ్రావణ మాసం ప్రారంభం నుంచి అత్యంత భక్తి శ్రద్దలతో శివలింగానికి పూజలు చేశాడు. రోజూ శివయ్యకు అభిషేకం చేస్తూ తనకు పెళ్లి కుదిరేలా అనుగ్రహించమంటూ వేడుకున్నాడు. అయితే ఉత్తరాదిలో శ్రావణ మాసం శ్రావణ పౌర్ణమితో పూర్తి అయి భాద్రపద మాసం వచ్చింది. అయినప్పటికీ తనకు పెళ్లి కుదరలేదని కోపంతో తాను పూజలను చేసిన శివలింగాన్ని దొంగిలించి పరారయ్యాడు.

Lord Shiva: వధువు కోసం శివయ్యకు పూజలు చేసిన యువకుడు..  శ్రావణ మాసం పూర్తి అయినా పెళ్లి కుదరలేదని ఏమి చేశాడంటే..
Shivalingam Stolen Inside A Temple
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని కౌశుంబిలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జంట శ్రావణ మాసాలు వచ్చాయి. ఉత్తరాదిలో ఈ శ్రావణ మాసం శివయ్య పూజకు అత్యంత పవిత్రమాసమని భావిస్తారు. తాము కోరిన కోర్కెలు తీర్చమంటూ భోళాశంకరుడికి భక్తి శ్రద్దలతో పూజలను చేస్తారు. తనకు పెళ్లి ఈ శ్రావణ మాసం అయ్యేలోగా జరగాలని కోరుకుంటూ.. శివ భక్తుడైన ఓ యువకుడు శ్రావణ మాసం ప్రారంభం నుంచి అత్యంత భక్తి శ్రద్దలతో శివలింగానికి పూజలు చేశాడు. రోజూ శివయ్యకు అభిషేకం చేస్తూ తనకు పెళ్లి కుదిరేలా అనుగ్రహించమంటూ వేడుకున్నాడు. అయితే ఉత్తరాదిలో శ్రావణ మాసం శ్రావణ పౌర్ణమితో పూర్తి అయి భాద్రపద మాసం వచ్చింది. అయినప్పటికీ తనకు పెళ్లి కుదరలేదని కోపంతో తాను పూజలను చేసిన శివలింగాన్ని దొంగిలించి పరారయ్యాడు. ఇప్పుడు ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సంఘటన మహేవాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, కుమ్హియావాన్ మార్కెట్‌కి చెందిన 27 ఏళ్ల ఛోటూ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అతను దేవునికి తన కోరిక విన్నవించి ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే శివుడికి జలాభిషేకం చేశాడు.  శ్రావణ మాసం అయిపోయింది.. అయినా చోటుకు పెళ్లి కుదరలేదు. వధువు దొరకలేదు. దీంతో శివుడిపై కోపం వచ్చి ఆలయంలోని లింగాన్ని దొంగిలించాడు. ఆలయం వెలుపల శివలింగాన్ని ఉంచి వెదురు, ఆకులతో కప్పి దాచాడు. మర్నాడు ఉదయం కొందరు భక్తులు ఆలయానికి చేరుకోగా.. శివలింగం కనిపించకుండా పోవడంతో షాక్ తిన్నారు. పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా.. శివలింగాన్ని దొంగిలించింది ఛోటూ అని తెలుసుకున్నారు.

పోలీసులు ఛోటూను విచారించారు. శివలింగాన్ని దొంగిలించి గుడి బయట దాచినట్లు అంగీకరించాడు. అంతేకాదు చోటు చెప్పిన రీజన్ విన్న పోలీసులు షాక్ తిన్నారు. చోటు దాచిన ప్లేస్ కు వెళ్లిన పోలీసులు  శివలింగాన్ని స్వాధీనం చేసుకుని.. తిరిగి గుడిలో ప్రతిష్టించారు. నిందితుడిపై పోలీసులు సెక్షన్ 379, 411 కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..