AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మల విసర్జన చేస్తుండగా శరీరంలోకి దూరిన పాము! లబోదిబోమంటూ ఆస్పత్రికి పరుగులు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత కేసు వెలుగు చూసింది. కడుపు నొప్పి అంటూ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి.. వైద్యులకు చెప్పిన కారణం ఇప్పుడు సంచలనంగా మారింది. తన కడుపు నొప్పికి కారణం ఓ పాము అని చెప్పాడు. అయితే, ఆ పాము కాటు వేయడం కారణం కాదిక్కడ. తాను బహిర్భూమికి వెళ్లినప్పుడు తన మలద్వారం నుంచి పాము శరీరంలోకి ప్రవేశించింది అనేది సదరు వ్యక్తి చెప్తున్న ముచ్చట.

Viral: మల విసర్జన చేస్తుండగా శరీరంలోకి దూరిన పాము! లబోదిబోమంటూ ఆస్పత్రికి పరుగులు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..
Snake Enters Into Body
Shiva Prajapati
|

Updated on: Apr 18, 2023 | 6:35 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత కేసు వెలుగు చూసింది. కడుపు నొప్పి అంటూ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి.. వైద్యులకు చెప్పిన కారణం ఇప్పుడు సంచలనంగా మారింది. తన కడుపు నొప్పికి కారణం ఓ పాము అని చెప్పాడు. అయితే, ఆ పాము కాటు వేయడం కారణం కాదిక్కడ. తాను బహిర్భూమికి వెళ్లినప్పుడు తన మలద్వారం నుంచి పాము శరీరంలోకి ప్రవేశించింది అనేది సదరు వ్యక్తి చెప్తున్న ముచ్చట. అవును, మీరు విన్నది నిజంగా నిజం. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఈ విచిత్ర ఘటన వెలుగు చూసింది.

మహేంద్ర అనే వ్యక్తి తాను బహిర్భూమికి వెళ్లినప్పుడు తన ప్రైవేట్ పార్ట్ నుంచి పాము శరీరంలోకి వెళ్లిందని, ఆ కారణంగా తీవ్రమైన కడుపు నొప్పి వస్తుందంటూ అర్థరాత్రి వేళ హర్దోయ్‌ ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులకు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. దాంతో కంగారుపడిపోయిన వైద్యులు.. వెంటనే అతనికి అవసరమైన పరీక్షలు చేశారు. స్కానింగ్, ఎక్స్‌రే తీశారు. అయితే, ఈ టెస్టుల్లో కడుపులో ఏ పాము దూరలేదని, కడుపు నొప్పికి ఇతర కారణాలున్నాయని చెప్పారు. పాము కాటు కూడా లేదని వైద్యులు నిర్ధారించారు. మద్యం మత్తులోనే అతను అలా ప్రవర్తించాడని వైద్యులు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని వైద్య సిబ్బంది క్లియర్‌గా, అన్ని ప్రూఫ్స్‌ చూపించినప్పటికీ మహేంద్ర, అతని కుటుంబ సభ్యులు అస్సలు అంగీకరించలేదు. పాము శరీరంలోకి వెళ్లిందనే అభిప్రాయంతోనే ఉన్నారు. సెకండ్ ఒపినీయన్‌ కోసం మరో ఆస్పత్రికి తరలించాలని అతని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. దాంతో ఆస్పత్రి సిబ్బంది.. మహేంద్రను మరుసటి రోజు ఉదయం డిశ్చార్జ్ చేశారు.

ఆస్పత్రి వైద్యుడు షేర్ సింగ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘మహేంద్ర మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. మాదకద్రవ్యాల వాడకం వల్ల కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఇదే విషయాన్ని అతను తన కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే, పాము శరీరంలోకి దూరడం వల్లే కడుపు నొప్పికి కారణం అని మహేంద్ర తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆందోళనకు గురైన వారు చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువచ్చారు. మహేంద్రకు సిటీ స్కాన్ చేసి చూశాం. ఎలాంటి సమస్యా లేదు. కానీ, బాధితుడు కుటుంబ సభ్యులు విశ్వసించలేదు. మరిన్ని పరీక్షలు చేయడం కోసం వేరే ఆస్పత్రికి రిఫర్ చేయాలని కోరారు. దాంతో మరుసటి రోజు అతన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశాం.’ అని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..