భార్యను బండిలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లిన వృద్ధుడు.. ఘటనపై విచారణకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి

Uttar Pradesh: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ఒక వృద్ధుడు బండి మీద పెట్టుకుని ఆ బండిని తాను చేతులతో లాక్కుని ఆసుపత్రికి తీసుకువెళుతున్న వీడియో ఒకటి  సోషల్ మీడియా..

భార్యను బండిలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లిన వృద్ధుడు.. ఘటనపై విచారణకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి
Uttar Pradesh Man
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 07, 2022 | 2:02 PM

Uttar Pradesh: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ఒక వృద్ధుడు బండి మీద పెట్టుకుని ఆ బండిని తాను చేతులతో లాక్కుని ఆసుపత్రికి తీసుకువెళుతున్న వీడియో ఒకటి  సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయింది. ఈ ఘటన ఆ రాష్ట్ర ప్రభుత్వం(Government) దృష్టికి చేరుకుంది. వెంటనే శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఈ వైరల్ వీడియోలో.. ఒక వృద్ధుడు రోగిని బండిలో ఆసుపత్రికి తీసుకువెళుతున్నట్లు తెలుస్తోంది.  ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతూ.. యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ దగ్గరకు చేరుకుంది. వెంటనే స్పందించిన ఆయన ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. సమాచారం అందుకున్న అధికారులు ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెల్త్ డైరెక్టర్ జనరల్‌ను కోరారు.

వైరల్ వీడియోలోని వ్యక్తిని జిల్లాలోని చిల్ఖర్ బ్లాక్‌లోని అండౌర్ గ్రామానికి చెందిన 58 ఏళ్ల సకుల్ ప్రజాపతిగా బల్లియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) నీరజ్ పాండే గుర్తించారు. ఈ సంఘటన మార్చి 28న జరిగింది. సకుల్ భార్యకు మధుమేహం ఉంది. కాళ్ల నొప్పులు రావడంతో సకుల్ తన భార్యను దగ్గర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి తీసుకుని వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అయితే భార్యను ఒక బండిలో పడుకోబెట్టుకుని.. దానిని తాను లాక్కుంటూ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న హెల్త్ సెంటర్ కు తీసుకుని తీసుకెళ్లాడు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంబులెన్స్ వస్తుందని భావించి తాను అంబులెన్స్‌కి కాల్ చేయలేదని సకూల్ చెప్పాడు. ఆరోగ్య కేంద్రం నుంచి తన భార్యను ఆటోరిక్షాలో జిల్లా ఆస్పత్రికి సకూల్ తీసుకెళ్లాడు’’ అని సీఎంఓ తెలిపారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మహిళ మృతి చెందినట్లు సీఎంఓ తెలిపారు.

ఇదే విషయంపై సకుల్ స్పందిస్తూ.. తన భార్య మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు  ప్రైవేట్ వ్యాన్‌ను అద్దెకు తీసుకోవలసి వచ్చిందని తెలిపాడు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆసుపత్రిలో ఉన్న కొందరిని అంబులెన్స్ , శవాన్ని తరలించే వాహనం కోసం అడిగానని, అయితే ఇవ్వడానికి  నిరాకరించారని ఆయన చెప్పారు.

ఇదే విషయంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. రాష్ట్రంలో తగిన ఆరోగ్య సౌకర్యాలు లేవంటూ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. బిజెపి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని  బల్లియా ఘటనకు సంబంధించిన వార్తను ట్యాగ్ చేశారు. స్ట్రెచర్ లేకపోవడంతో ఓ వ్యక్తి వృద్ధ రోగిని తన చేతుల్లో ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకువెళ్తున్న ఫోటోను ట్యాగ్ చేస్తూ, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ తీరు  ఇలా  ఉందని యాదవ్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఆరోగ్య రంగానికి తగినంత ఖర్చు చేయడం లేదని అన్నారు.

Also Read :Tinda Benefits: చాలామందికి తెలియని కూరగాయ టిండా.. వేసవిలో షుగర్ పేషేంట్స్‌కు బెస్ట్ ఆహారం..