AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూలికా ఫేస్ మాస్క్ చూడాలంటే యూపీ వెళ్లాల్సిందే ! జుగాడి బాబా స్టైలే వేరు ! ఖర్చు తక్కువ, నాణ్యత ఎక్కువ అట !

ఈ కోవిడ్ తరుణంలో వివిధ రకాల మాస్కులు దర్శనమిస్తున్నాయి, చవకైనవి, ఖరీదైనవి, సర్జికల్ మాస్కులు, రకరకాల రంగుల్లో మార్కెట్లో అమ్మకానికి ఉంటున్నాయి.

మూలికా ఫేస్ మాస్క్ చూడాలంటే యూపీ వెళ్లాల్సిందే ! జుగాడి బాబా స్టైలే వేరు !   ఖర్చు తక్కువ, నాణ్యత ఎక్కువ అట !
Uttar Pradesh Junagadh Baba Wears Herbal Mask For Covid 19
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 24, 2021 | 8:52 AM

Share

ఈ కోవిడ్ తరుణంలో వివిధ రకాల మాస్కులు దర్శనమిస్తున్నాయి, చవకైనవి, ఖరీదైనవి, సర్జికల్ మాస్కులు, రకరకాల రంగుల్లో మార్కెట్లో అమ్మకానికి ఉంటున్నాయి. వీటిలో సర్జికల్ మాస్కులయితే దాదాపు 200 రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. అయితే యూపీలోని ఓ బాబా మాత్రం తనకు అంత ఖరీదైన మాస్కులు అవసరం లేదని అంటున్నాడు. 72 ఏళ్ళ ఈ బాబా మూలికలతో తయారు చేసిన వెరైటీ మాస్క్ ధరించి అందర్నీ ఆకర్షిస్తున్నాడు. నిమ్మ చెట్టు ఆకులు, తులసి ఆకులు, మరికొన్ని మూలికలతో కలిపి తయారు చేసిన ఇది కోవిడ్ ని నివారిస్తుందని, పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని ఈయన అంటున్నాడు. ఎలాంటి అనారోగ్యాన్నీ ఇది దరి చేరనీయదని చెబుతున్నాడు. స్థానికంగా జుగాడి బాబా అని వ్యవహరిస్తున్న ఈయన.. ఇది ఎన్నో ఏళ్ళ నాటి వైద్య సంబంధ ప్రక్రియ అని, ప్రతివారూ ఇలాంటి మాస్క్ ధరిస్తే మేలని సూచిస్తున్నాడు. అతి తక్కువ ఖర్చుతో చేసిన దీన్ని రెండు మూడు రోజులకొకసారి మార్ఛవచ్చునట. యూపీలోని సీతాపూర్ జిల్లాలో ఈయన ఇలా తన మూలికా మాస్క్ తో ఆకట్టుకుంటున్నాడు.తమ కుటుంబం కూడా ఇలాంటి మాస్కులనే ధరిస్తోందని అంటున్నాడు. కోవిద్ చికిత్స కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లో ఆనందయ్య కొన్ని మూలికలతో తయారు చేస్తున్న నాటు పసరు మందును ఈ సందర్బంగా పలువురు గుర్తు చేస్తున్నారు.

యూపీలో ఇప్పుడిప్పుడు కోవిద్ కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రతివారూ మాస్కులు ధరించాలన్న రూల్ ని ఖచ్చితంగా పాటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: కరోనా బాధితుల సేవలో సెలబ్రెటీలు.. వంద ఆక్సిజన్ బెడ్స్ అందించిన సింగర్ స్మిత.. ఇదంతా వారివల్లే సాధ్యమంటూ ట్వీట్

Lockdown: యువకుడిని కొట్టిన సూరజ్‌పూర్ జిల్లా కలెక్టర్‌పై వేటు.. సస్పెండ్ చేసిన ప్రభుత్వం..