AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్ళముందే ఏరులై పారిన లారీ లోడ్ బీర్లు.. గుండెలు బాదుకున్న మద్యం ప్రియులు!

ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో జరిగిన ఒక వింతైన రోడ్డు ప్రమాదం స్థానికులకు పండుగ తెచ్చిపెడితే, పోలీసులకు మాత్రం పెద్ద సవాలుగా మారింది. జాతీయ రహదారిపై బీరు కంటైనర్ - మిరపకాయల ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో జాతీయ రహదారిపై గందరగోళంగా మారిపోయింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని గురించి కాకుండా లారీల్లోని సరుకు కాపాలా కాయలేని పోలీసులు నానా హైరానా పడ్డారు.

కళ్ళముందే ఏరులై పారిన లారీ లోడ్ బీర్లు.. గుండెలు బాదుకున్న మద్యం ప్రియులు!
Beer Container Accident
Balaraju Goud
|

Updated on: Apr 15, 2026 | 3:55 PM

Share

ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో జరిగిన ఒక వింతైన రోడ్డు ప్రమాదం స్థానికులకు పండుగ తెచ్చిపెడితే, పోలీసులకు మాత్రం పెద్ద సవాలుగా మారింది. జాతీయ రహదారిపై బీరు కంటైనర్ – మిరపకాయల ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో జాతీయ రహదారిపై గందరగోళంగా మారిపోయింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని గురించి కాకుండా లారీల్లోని సరుకు కాపాలా కాయలేని పోలీసులు నానా హైరానా పడ్డారు.

ఝాన్సీ – కాన్పూర్ జాతీయ రహదారిపై, మోంతా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మీరట్ నుండి వేలకొద్దీ బీరు బాటిళ్లతో వస్తున్న ఒక భారీ కంటైనర్, ఎదురుగా మిరపకాయల లోడుతో వస్తున్న ట్రక్కును అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ట్రక్కులోని మిరపకాయల బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతమంతా ఘాటైన వాసనతో నిండిపోయింది. అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం బీరు కంటైనర్!

సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్థానికులు సరుకును ఎత్తుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బీరు కంటైనర్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక్క బాటిల్ కూడా బయటకు పోకుండా చూడటానికి కంటైనర్ చుట్టూ ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ట్రాఫిక్ క్లియర్ చేయడం ఒకెత్తయితే, ఆ ‘లిక్విడ్ గోల్డ్’ను కాపాడటం పోలీసులకు మరో పెద్ద టాస్క్‌గా మారింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. భారీ క్రేన్ల సహాయంతో వాహనాలను తొలగించి, రహదారిపై గంటల తరబడి నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరించారు.రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వేగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్థానిక యంత్రాంగం మరోసారి హెచ్చరించింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, ఈ ‘బీరు-మిర్చి’ ప్రమాదం మాత్రం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..