Transgender Toilet: ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా టాయిలెట్.. ఎక్కడో తెలుసా..?

|

Feb 19, 2021 | 12:11 AM

Transgender Toilet in Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్డిని నియమించింది. ఇది దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ టాయిలెట్‌. ఉత్తరప్రదేశ్‌లోని ప్రధానమంత్రి..

Transgender Toilet: ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా టాయిలెట్.. ఎక్కడో తెలుసా..?
Follow us on

Transgender Toilet in Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్డిని నియమించింది. ఇది దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ టాయిలెట్‌. ఉత్తరప్రదేశ్‌లోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలో మొట్ట మొదటి ట్రాన్స్‌జెండ్ టాయిలెట్ నిర్మాణమైంది. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా వారణాసిలోని కామాచ ప్రాంతంలో ఈ టాయిలెట్‌ను ఏర్పాటు చేశారు. దీనిని వారణాసి మేయర్‌ మృదుల జైస్వాల్‌ గురువారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోనే ఇది మొదటి ట్రాన్స్‌జెండర్‌ టాయిలెట్‌ అని ఆమె పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్లకు అవసరమైన ఇతర ప్రాంతాల్లో కూడా వీటిని నిర్మించేందుకు సిద్ధమని వారణాసి మేయర్‌ తెలిపారు. ఈ టాయిలెట్లు ట్రాన్స్‌జెండర్ల కోసం మాత్రమేనని ఇతరుల కోసం కాదని వారణాసి మున్సిపల్‌ కమిషనర్‌ గౌరంగ్‌ రతి పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లో వారికోసం మరో నాలుగు టాయిలెట్లను నిర్మించనున్నట్లు తెలిపారు.

Also Read:

 

Amravati Lockdown: అమరావతిలో మళ్లీ లాక్‌డౌన్‌.. తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న కరోనా కేసులు